Begin typing your search above and press return to search.

బాబు... బ్రిటీష్ బ్యూటీని వ‌ద్ద‌ల్లేదు

By:  Tupaki Desk   |   26 April 2018 7:09 AM GMT
బాబు... బ్రిటీష్ బ్యూటీని వ‌ద్ద‌ల్లేదు
X
ప్ర‌ముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా సులువుగానే తెరంగేట్రం చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్‌. మొద‌టి సినిమా ఫ‌ర్వాలేద‌నిపించ‌డంతో ఏడాదికో సినిమా చేసుకుంటూ పోతున్నాడు. మొద‌టిసినిమా నుంచి హీరోయిన్ల విష‌యంలో మాత్రం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. పెద్ద హీరోయిన్ల‌కి త‌ప్ప చిన్నా చిత‌కా హీరోయిన్ల వంక‌ కూడా చూడ‌డం లేదు. అత‌ని కెరీర్లో ఒక్క బిగ్గెస్ట్ హిట్ లేక‌పోయినా టాప్ హీరోయిన్లంతా అత‌ని సినిమాలో చేసేందుకు సులువుగా ఒప్పేసుకుంటున్నారు. అందుకు అత‌ను భారీగా ఖ‌ర్చుపెట్ట‌డ‌మే కార‌ణం.

శ్రీనివాస్ మొద‌టి సినిమా అల్లుడు శీను. మొద‌టి సినిమాలోనే స‌మంత‌ను హీరోయిన్ గా పెట్టుకున్నాడు. ర‌కుల్ ప్రీత్ త‌మ‌న్నాల‌తో కూడా ఆడిపాడాడు. ప్ర‌స్తుతం అత‌ను చేస్తున్న సినిమా సాక్ష్యం. అందులో పూజా హెగ్డే హీరోయిన్‌. ఆమెను సినిమాలో చేసేందుకు ఒప్పించేందుకు రెమ్యున‌రేష‌న్ భారీగా స‌మ‌ర్పించార‌ట‌. ఆ సినిమా ఇంకా షూటింగ్‌లో ఉండ‌గానే మ‌రో సినిమాకు కూడా సైన్ చేశాడు శ్రీనివాస్‌. కొత్త‌ద‌ర్శ‌కుడి ద‌ర్శ‌క‌త్వంలో ఆ సినిమా చేయ‌బోతున్నాడు. అందులో ఫ‌స్ట్ హీర‌యిన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను ఎంపిక చేసుకున్నాడు. ఇప్ప‌టికే ఆమె కూడా సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. నిర్మాత చేత కాజ‌ల్ కు కూడా భారీగా రెమ్యున‌రేష‌న్ ఇప్పించాడ‌ని టాక్‌. ఇక రెండో హీరోయిన్‌గా మ‌రో బ్రిటిష్ మోడ‌ల్ రోబో హీరోయిన్‌ను ఎంపిక చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

అమీ జాక్స‌న్ రోబో 2.0లో మెయిన్ హీరోయిన్. బ్రిటిష్ మోడ‌ల్ అయినా ఆమె అందుకునే పారితోషికం త‌క్కువేమీ కాదు. అయినా కూడా అమీనే ఏరికోరి మ‌రీ సెకండ్ హీరోయిన్ ఎంపిక చేసుకున్నాడు శ్రీనివాస్‌. త‌న‌కు పెద్ద‌గా ఫేమ్ లేదు కాబ‌ట్టి బాగా ఫాలోయింగ్ ఉన్న స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ల‌నే ఎంచుకుంటున్నాడు కుర్ర హీరో.