Begin typing your search above and press return to search.

బ్లాక్ బస్టర్ రీమేక్ లో బెల్లం హీరో ?

By:  Tupaki Desk   |   20 Jan 2019 9:34 AM GMT
బ్లాక్ బస్టర్ రీమేక్ లో బెల్లం హీరో ?
X
భారీతనానికి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే కథల్లో తప్ప కనీసం మీడియం రేంజ్ వైపు కన్నెత్తి చూడని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను గత ఏడాది కూడా నిరాశ పరిచింది. సాక్ష్యం కవచం రెండూ ఒకే ఫలితాన్ని అందుకున్నాయి. ఇప్పుడు తేజ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా మీద ఆశలన్నీ పెట్టుకున్నాడీ బెల్లం హీరో. ఇదిలా ఉండగా తమిళ్ లో గత ఏడాది చివర్లో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన రట్ససన్ రీమేక్ హక్కులు నితిన్ కొన్న సంగతి తెలిసిందే. తనే హీరోగా సుధీర్ వర్మ డైరెక్షన్ లో ప్లాన్ చేసుకున్నాడు.

అయితే వెంకీ కుడుములతో చేయాల్సిన భీష్మ మొదలుకాకుండానే చిన్న యాక్సిడెంట్ వల్ల రెస్ట్ అవసరం పడటంతో రట్ససన్ రీమేక్ ఆలోచన పెండింగ్ లో పెట్టేసాడు. అయితే ఇప్పుడు దీనికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రీప్లేస్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కాని దర్శకుడు కూడా మారాడు. సుధీర్ వర్మ శర్వానంద్ సినిమాకు సంబంధించిన బాలన్స్ షూటింగ్ లో బిజీగా ఉండటంతో పాటు వేరే కమిట్మెంట్ వల్ల ఇది రమేష్ వర్మకు వెళ్లినట్టు వినికిడి. నాని-తనీష్ లతో రైడ్ రవితేజతో వీర తీసిన ఈ దర్శకుడు ప్రస్తుతం రట్ససన్ తెలుగు వెర్షన్ కు కావలసిన మార్పులు చేర్పులు చేయడంలో బిజీగా ఉన్నట్టు సమాచారం.

అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మిగిలిన టీమ్ ఏంటి అనే వివరాలు తెలియాల్సి ఉంది. రట్ససన్ సైకో థ్రిల్లర్. టీనేజ్ అమ్మాయిలను హత్య చేసే హంతకుడి కోసం హీరో చేసే వేట గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో కట్టిపడేసేలా ఉంటుంది. తమిళనాట వంద రోజులు ఆడింది. తెలుగుకు అనుగుణంగా మార్పులు చేసి ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి. ఇది ఓకే అయితే కనక బెల్లం హీరోకు మొదటి రీమేక్ మూవీ అవుతుంది