మరో స్టార్ హీరోయిన్ ని పట్టాడు!!

Fri Feb 17 2017 23:28:51 GMT+0530 (IST)

అల్లుడు శీను అంటూ టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీనే ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. నిర్మాత బెల్లంకొండ సురేష్ గా అరంగేట్రం చేసినా.. తన యాక్టింగ్ లో ఈజ్ తో గుర్తింపు బాగానే సంపాదించుకున్నాడు. కానీ ఈ కుర్ర హీరో రెండో సినిమా స్పీడున్నోడు మాత్రం ఏ రకమైన స్పీడ్ చూపించకపోవడంతో.. తన స్పీడ్ తగ్గించుకుని స్టార్ డైరెక్టర్ బోయపాటి సినిమా చేసే వరకూ ఆగాడు.

మళ్లీ గేర్ మార్చి స్పీడ్ పెంచి డిక్టేటర్ డైరెక్టర్ శ్రీవాస్ తో కొత్త  సినిమా కమిట్ అయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్. అయితే హీరోయిన్స్ విషయంలో ఇతడి టేస్ట్ ని సెలక్షన్ ని చూసి అందరికీ షాక్ కొట్టేస్తోంది. మొదటి మూవీలోనే సమంతతో ఆడిపాడిన బెల్లంకొండ.. మొదటి రెండు సినిమాల్లోనూ మిల్కీ బ్యూటీ తమన్నాను ఐటెం గాళ్ చేసేశాడు. ఇప్పుడు చేస్తున్న బోయపాటితో మూడో చిత్రంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కాగా.. నెక్ట్స్ మూవీకి కూడా స్టార్ హీరోయిన్ నే పట్టుకొచ్చాడు.

శ్రీవాస్ డైరెక్షన్ లో చేయనున్న సినిమాలో హీరోయిన్ గా చెన్నై సుందరి శృతి హాసన్ నటించనుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆమె దగ్గరకు ప్రపోజల్ కూడా పంపారట. అటు వైపు నుంచి ఇంకా రియాక్షన్ రాలేదు కానీ.. భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి  హీరోయిన్స్ ను కమిట్ చేయించడంలో బెల్లంకొండ బాగా ఆరితేరిపోయాడు. పైగా ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించనుండడంతో.. శృతి సైన్ చేయడం దాదాపు లాంఛనమే అని టాక్.