బెల్లంకొండ సాక్ష్యానికి అది లోటేనట!

Fri Jul 20 2018 16:57:27 GMT+0530 (IST)

ప్రతీ హీరోకి ఒక మార్కెట్ రేంజ్ ఉంటుంది.. అది ఒక కోటి కావచ్చు లేదా 10 కోట్లు కావచ్చు లేదా 100 కోట్లైనా కావచ్చు.  అందరినీ ఒకే గాటన కట్టలేం.  కానీ బెల్లంకొండ వారబ్బాయి సాయి శ్రీనివాస్ మార్కెట్ ఎంతో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.  శ్రీనివాస్ ప్రతి సినిమా హై బడ్జెట్ లో తెరకెక్కేదే.. కానీ ఇప్పటి వరకూ అందరూ బయ్యర్లకు లాభాలు తీసుకొచ్చిన సినిమా మాత్రం లేదు.  ఇలాంటి వాటితో సంబంధం లేకుండా బెల్లంకొండ బాబు మాత్రం ప్రతిసారి హై బడ్జెట్ సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.తన తాజా చిత్రం 'సాక్ష్యం' జూలై 27 న రిలీజ్ కు సిద్ధంగా ఉంది.  శ్రీవాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై నిర్మాతలు దాదాపుగా 40 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టారట.  కానీ శ్రీనివాస్ సినిమా హక్కులు మాత్రం ఆ రేంజ్ రేట్లకు అమ్ముడు పోవు కదా.   దాంతో సినిమాను డెఫిసిట్ లోనే రిలీజ్ చేస్తున్నారని ఫిలిం నగర్ టాక్.   నిర్మాత అభిషేక్ నామా కృష్ణ జిల్లా - ఓవర్సీస్ లలో ఓన్ రిలీజ్ చేసుకుంటున్నాడట. దిల్ రాజు మొదట నైజాం ఏరియాలో మొదట రిలీజ్ చేయాలని అనుకున్నా చివరి నిముషంలో వెనకడుగు వేశాడట.. దాంతో హీరోనే  రంగంలోకి దిగి నైజాం ఏరియా లో ఓన్ రిలీజ్ చేసేందుకు సిద్దం అయ్యాడట.  

మరి 'సాక్ష్యం' శ్రీనివాస్ కు సూపర్ హిట్ అందిస్తుందో లేదో వేచి చూడాలి.   ప్రస్తుతానికైతే సినిమా మీద మంచి బజ్ ఉంది.  ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో 'సాక్ష్యం' టీమ్ తమ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగేలా చేయడంలో విజయం సాధించారు.  మరి కంటెంట్ కూడా ఆడియన్స్ కు కనెక్ట్ అయితే ఇక బాక్స్ ఆఫీస్ వద్ద బెల్లంకొండ బాబుకు మంచి హిట్ పడ్డట్టే.