Begin typing your search above and press return to search.

తమన్నా కేక, నేను అలాంటోడిని కాదు

By:  Tupaki Desk   |   5 Feb 2016 5:30 PM GMT
తమన్నా కేక, నేను అలాంటోడిని కాదు
X
బెల్లంకొండ శ్రీనివాస్ - సోనారియా భడోరియా జంటగా నటించిన స్పీడున్నోడు మూవీ ఇవాళే రిలీజ్ అయింది. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా.. హీరో సాయి శ్రీనివాస్ బోలెడన్ని కబుర్లు చెప్పేస్తున్నాడు. ముఖ్యంగా ఈ మూవీలో ఐటెం సాంగ్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నాని అయితే తెగ పొగిడేస్తున్నాడు ఈ కుర్రాడు.

తమన్నా మంచి డ్యాన్సర్, ఒక జోష్ ఉన్న సాంగ్ చేయాలంటే తమన్నానే చేయాలి. మేమిద్దరం ఒకే ఏజ్ గ్రూప్ కదా, ఫ్రెండ్లీగా ఉంటాం. అవకాశమొస్తే.. తమ్మూతో సినిమాకి నేను ఎప్పుడూ రెడీ అంటున్నాడు బెల్లంకొండ. అలాగే అల్లుడుశీను తర్వాత రెండో సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడట. 30-40 స్టోరీలు విని చివరకు.. సుందరపాండియన్ రీమేక్ కు సై అన్నట్లు చెప్పాడు. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అని.. దీనికోసమే మూవీ యాక్సెప్ట్ చేశానని కూడా చెప్పాడు ఈ కుర్ర హీరో. థియేటర్ నుంచి బయటకొచ్చాక కూడా.. ప్రేక్షకులను వెంటాడే కాన్సెప్ట్ ఇది అన్నాడు.

ఈ మూవీలో తను అమ్మాయిలను ఈజీగా పడేసే కేరక్టర్ చేశాడట. ఫ్రెండ్స్ కి కూడా అమ్మాయిలను ఎలా బుట్ట వేసుకోవాలో టిప్స్ ఇస్తుంటాను కానీ.. రియల్ లైఫ్ లో మాత్రం నేను అలాంటోడిని కాదంటూ నవ్వేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. తన స్పీడు. సినిమాలో కేరక్టర్ చూసే... ఈ మూవీకి స్పీడున్నోడు అనే టైటిల్ ని దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు సెట్ చేశాడని చెప్పాడు. తన నెక్ట్స్ మూవీ బోయపాటి శ్రీను డైరెక్షన్ లోనే ఉంటుందని చెప్పాడు ఈ హీరో.