Begin typing your search above and press return to search.

బెల్లంకొండ బాబు ప్రయోగానికి రెడీ

By:  Tupaki Desk   |   22 Feb 2018 10:34 AM GMT
బెల్లంకొండ బాబు ప్రయోగానికి రెడీ
X

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటివరకూ కమర్షియల్ చిత్రాలతో సత్తా చాటేందుకు బాగానే ప్రయత్నించాడు. అనుభవం ఉన్న దర్శకులతోనే సినిమాలు చేస్తూ.. ఆడియన్స్ ను అలరించేందుకు ట్రై చేశాడు. అయితే.. ఇవి కేవలం మాస్ ఆడియన్స్ ను మాత్రమే ఈ యంగ్ హీరోకు దగ్గర చేశాయి.

ఇతర వర్గాలకు చెందిన ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు.. కొత్తదనం ఉన్న సినిమాలను అందించక తప్పదనే సంగతి ఈ హీరోకు అర్దమయినట్లు ఉంది. అందుకే ఇప్పుడు ఓ వెరైటీ కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడట. శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడు బెల్లంకొండ హీరో. ఇది ఇద్దరు హీరోయిన్లు ఉండే లవ్ స్టోరీ అయినా.. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో సాగుతుందని తెలుస్తుంది. స్టోరీతో పాటు ఆ కథను దర్శకుడు నెరేట్ చేసిన తీరు.. ముఖ్యంగా స్క్రీన్ ప్లేను దర్శకుడు రూపొందించిన విధానం విపరీతంగా నచ్చేశాయని.. అందుకే ఈ చిత్రాన్ని వెంటనే స్టార్ట్ చేసేందుకు ఒప్పుకున్నాడని చెబుతున్నారు.

వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ సొంటినేని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రీసెంట్ గా రామానాయుడు స్టూడియోస్ లో.. ఈ చిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలను గ్రాండ్ గా నిర్వహించారు. ఇప్పటివరకూ మాస్ సినిమాలతో అలరించిన బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో.. ఇదో వైవిధ్యభరితమైన చిత్రంగా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది.