Begin typing your search above and press return to search.

తేజ సినిమాకు స్ఫూర్తి అదేనా!

By:  Tupaki Desk   |   14 July 2018 10:00 AM GMT
తేజ సినిమాకు స్ఫూర్తి అదేనా!
X
ఈ నెల 27న విడుదల కానున్న సాక్ష్యం కోసం ఎదురు చూస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దాని మీద గట్టి ఆశలే పెట్టుకున్నాడు. ఫాంటసీ నేపథ్యంలో శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన సాక్ష్యం బ్రేక్ ఇస్తుందనే అంచనాలు ట్రేడ్ లో సైతం ఉన్నాయి. ఇదిలా ఉంచితే జయాపజయాలతో సంబంధం లేకుండా వరసగా భారీ ప్రాజెక్ట్ లు లైన్ లో పెట్టేస్తున్న ఈ బెల్లం హీరో ఇటీవలే తేజ దర్శకత్వంలో కొత్త సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. విశ్వసనీయమైన సమాచారం మేరకు ఇది ఒక హాలీవుడ్ సినిమాకు స్ఫూర్తి అనే టాక్ ప్రస్తుతం జోరుగా నడుస్తోంది. 1988లో డస్టిన్ హోప్మ్యాన్ -టామ్ క్రూయిజ్ నటించిన రైన్ మ్యాన్ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. ఒకే కడుపున పుట్టకపోయినా భిన్న ధృవాలుగా కనిపించే ఇద్దరు అన్నదమ్ముల కథ ఇది. ఒక పాత్ర చాలా అమాయకంగా ఉంటే మరోపాత్ర దానికి విరుద్ధంగా ఉంటుంది. అందులోలా కాకుండా ఆ కథను డ్యూయల్ రోల్ గా మార్చి తేజ తెలుగు నేటివిటీ పరంగా చాలా మార్పులు చేసి దీన్ని తీస్తున్నట్టు సమాచారం. ఇలాంటివి అధికారికంగా ప్రకటించరు కాబట్టి నిర్ధారణగా చెప్పలేం కానీ ఈ మధ్య తెలుగు సినిమాల స్ఫూర్తి వార్తలన్నీ దాదాపుగా నిజమవుతున్న నేపధ్యంలో పూర్తిగా కొట్టి పారేయలేం.

తేజ వీలైనంత త్వరగా దీన్ని ఫినిష్ చేసే టార్గెట్ తో ఉన్నాడు. సాయి శ్రీనివాస్ కూడా పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు కాబట్టి దాన్ని ఈ రూపంలో ఇవ్వాలని గట్టిగా ట్రై చేస్తున్నాడట. చేతి దాకా వచ్చి రెండు సినిమాలు చేజారిన నేపధ్యంలో తేజ కసిమీదున్నాడు. అజ్ఞాతవాసి తరహాలో ఒకవేళ ఈ స్ఫూర్తి నిజమని తేలితే ఒప్పేసుకుంటారో లేక దానికి దీనికి సంబంధం లేదని ఋజువు చేస్తారో వేచి చూడాలి. రిచ్ మ్యాన్ అప్పట్లో కీలకమైన విభాగాల్లో నాలుగు ఆస్కార్ అవార్డులు కొట్టేసింది. అందుకే తేజ రిస్క్ లేకుండా ఈ కథను ఎంచుకున్నాడా అనే టాక్ కూడా ఉంది. టీజర్ విడుదల అయ్యే దాకా దీని గురించి ఒక కంక్లూజన్ కు రాలేము కానీ ఒకవేళ నిజమైనా నష్టమేమి లేదు. ముప్పై ఏళ్ళ వెనుక కథ కాబట్టి ఇప్పటి ట్రెండ్ కు అనుగుణంగా మార్పులు చేస్తే చాలు. సినిమా బాగుందా లేదా అనేది ప్రేక్షకుడికి ముఖ్యం కానీ ఎక్కడి నుంచి స్ఫూర్తి తీసుకున్నారు అనేది అనవసరం.