Begin typing your search above and press return to search.

డిటెక్టివ్‌ గా మారిన యంగ్ హీరో

By:  Tupaki Desk   |   21 Feb 2018 7:22 AM GMT
డిటెక్టివ్‌ గా మారిన యంగ్ హీరో
X
రొటీన్ క‌థ‌లతో ఉన్న‌ సినిమాల‌ను చూడ‌డం త‌గ్గించారు ప్రేక్ష‌కులు. వారికి కొత్త‌ద‌నం కావాలి. అందుకే డైరెక్ట‌ర్లు - హీరోలు కూడా కొత్త క‌థ‌ల కోసం - విభిన్న పాత్ర‌ల కోసం ఎదురుచూస్తున్నారు. అలా క‌థ బెల్లంకొండ శ్రీనివాస్‌కి దొరికింది. త్వ‌ర‌లో డిటెక్టివ్ గా క‌నిపించ‌బోతున్నాడు అల్లుడు శీను హీరో.

జ‌య‌జాన‌కి నాయ‌క సినిమా త‌రువాత బెల్లంకొండ శ్రీనివాస్ త‌న త‌రువాతి సినిమాకు ఓకే చేశాడు. క‌థల విష‌యంలో అస్స‌లు తొంద‌ర‌ప‌డ‌కుండా ఎంచుకుంటున్నాడు శ్రీనివాస్‌. ఇప్పుడు ఓ కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఇంత‌వ‌ర‌కు అనేక మంది తెలుగు ద‌ర్శ‌కుల ద‌గ్గ‌ర అసిస్టెంట్ గా ప‌నిచేసిన అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుడాయ‌న‌. పేరు ఇంకా బ‌య‌ట‌కు రాక‌పోయినా... శ్రీనివాస్ అత‌ని సినిమాకు సైన్ కూడా చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో చాలా డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో హీరో క‌నిపించ‌బోతున్నాడు. జేమ్స్ బాండ్ త‌ర‌హా పాత్ర అది. డిటెక్టివ్ గా క‌నిపించి అల‌రించ‌బోతున్నాడు.

ఆ పాత్ర‌కు త‌గ్గ‌ట్టు త‌న‌ను తాను మార్చుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు శ్రీనివాస్‌. అందుకోసం బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో శిక్ష‌ణ తీసుకోబోతున్నాడ‌ట‌. స్క్రిప్ట్ త‌గ్గ‌ట్టు త‌న న‌ట‌న‌లో కూడా మార్పులు చేసుకోబోతున్నాడ‌ట‌. ఇకపోతే ఈ సినిమాలో యథావిథిగా చాలా ఖర్చుపెట్టేసి ఒక స్టార్ హీరోయిన్ ను ఒక మామూలు హీరోయిన్ ను తీసుకున్నాడు. అదేనండీ బాబూ.. అటు కాజల్ అగర్వాల్ ఇటు క్యాథరీన్ త్రెసాతో మనోడు రొమాన్స్ చేయనున్నాడు