Begin typing your search above and press return to search.

త‌ప్పు తెలుసుకున్న యంగ్ హీరో!

By:  Tupaki Desk   |   21 May 2019 6:03 AM GMT
త‌ప్పు తెలుసుకున్న యంగ్ హీరో!
X
హీరో అంటే ఫైట్స్ ఇర‌గ‌దీయాలి. ఇంట్ర‌డ‌క్ష‌న్ అదిరిపోవాలి. డ్యాన్సులు ఊపేయాలి! అనుకుంటే ఏం జ‌రుగుతుందో స్వీయ అనుభ‌వం అయిన‌ట్టుంది! స‌ద‌రు యంగ్ హీరో ఈ క‌ఠోర స‌త్యాన్ని చాలా ఎర్లీగానే గ్ర‌హించాడు. తాను చేసిన త‌ప్పును బ‌హిరంగ వేదిక‌పైనే ఒప్పుకున్నాడు. త‌ప్పు తెలుసుకుని రియ‌లైజ్ అయ్యాడు. తెలుసుకునేలా చేసిన ద‌ర్శ‌కుడిని ఎంతో పొగిడేశాడు. ఇంత‌కీ ఎవ‌రా హీరో? అంటే యంగ్ హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్. సాయి శ్రీ‌నివాస్ గ‌త సినిమాల‌న్నీ డిజాస్ట‌ర్లుగా నిల‌వ‌డం వెన‌క ఊర మాస్ యాక్ష‌న్ కూడా ఒక కార‌ణ‌మ‌ని.. స‌రైన క‌థ కాక‌ర‌కాయ లేక‌.. ఒక‌వేళ ఉన్నా.. క‌ల‌గాపుల‌గంగా ఎలాంటి గ్రిప్ లేకుండా ఊర మాస్ స్టైల్లో సినిమాలు తీయ‌డం త‌న‌ని పెద్ద దెబ్బ కొట్టింద‌ని శీను గ్ర‌హించిన‌ట్టే ఉన్నాడు. ఏదైతేనేం యాక్ష‌న్ సినిమాలతో మాస్ కి చేరువ అవ్వాల‌న్న ఫ‌త‌కం ఫెయిలైంద‌ని గ్ర‌హించాడు.

చేసిన త‌ప్పును తెలుసుకుని స‌రిదిద్దుకునేవాడే సిస‌లైన స‌క్సెస్ ని అందుకోగ‌ల‌డు. ఆ కోణంలో చూస్తే శీనూ త‌న గ‌త త‌ప్పుల‌న్నీ దిద్దుకునేందుకే `సీత` సినిమాలో న‌టించాడ‌ని అనుకోవాలి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన చిత్రం చిత్రం సీత ఈనెల 24న రిలీజ‌వుతోంది. ఈ చిత్రంలో మన్నారా చోప్రా మరో నాయిక. పాయ‌ల్ రాజ్ పుత్ ఐటెమ్ పాట‌లో న‌ర్తించింది. ఎ.కె.ఎంటర్‌ టైన్‌ మెంట్‌ బ్యానర్‌ పై రామబ్రహ్మం నిర్మించారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించిన పాట‌లు రిలీజ‌య్యాయి. ప్రీ రిలీజ్ వేడుకలో శీను మాట్లాడుతూ చాలానే రియ‌లైజేష‌న్ చూపించాడు.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ ``హీరో అంటే ఆరంభ‌మే కనిపించాలి. ఇంట్ర‌డ‌క్ష‌నే ఫైట్లు చేసేయాలి అనుకునేవాణ్ని. కానీ తేజగారితో పనిచేశాక అది తప్పని తెలుసుకున్నాను`` అని అన్నారు. మ‌రిన్ని సంగ‌తులు చెబుతూ-``సీత‌ కథ విషయానికి వస్తే.. మహిళలకు పురుషుల కంటే మేధస్సు ఎక్కువ. కానీ దానిని ఎవ‌రూ ప్రాక్టికల్‌గా చూపించలేదు. అందుకే ఆ లోటును తీర్చే కథతో సీత సినిమా చేశాం. టైటిల్ రోల్ చేసిన కాజల్ చాలా కష్టపడ్డారు. సోనూసూద్ గారు ఈ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశారు. అనూప్ రుబెన్స్ ఆర్ ఆర్‌ తో మైమ‌రిపిస్తుంది`` అన్నారు. సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరి ప్రేమ- ఆదరణ పొందడానికి జీవితాంతం ఇలాగే కష్టపడుతాన‌ని శ్రీ‌ను ప్రామిస్ చేశారు. సినిమానే నాకు ప్రాణం. సినిమాకోసం నేను ఏమైనా చేస్తా. తేజగారిలాంటి ఫ్యాషనేట్ ఫిల్మ్ మేకర్‌ను నేను లైఫ్‌లో ఇప్పటివరకు కలవలేదు. ఇలాంటి ప్యాషన్ ఉన్న డైరెక్టర్లను అరుదుగా చూస్తాం. నా ఆరో సినిమాకే ఇలాంటి దర్శకుడితో పనిచేస్తానని అనుకోలేదు. రఘురామ్ అనే ఛాలెంజింగ్ పాత్ర‌తో మీ అంద‌రినీ మెప్సిస్తాను. నా రోల్ తప్పకుండా సర్‌ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమా నాకు న‌టుడిగా మంచి గౌర‌వం తీసుకొస్తుందని బలంగా నమ్ముతున్నాను`` అన్నారు. అన్నిటికీ స‌మాధానం మే 24. తెర‌పై చూసి శీనులోని కాన్ఫిడెన్స్ వెన‌క రీజ‌న్ ఏంటో తేల్చాల్సి ఉంటుంది.