అమితాబ్ స్ఫూర్తితోనే ఆ పేరు

Thu Dec 06 2018 15:20:37 GMT+0530 (IST)

బెల్లంకొండ శ్రీనివాస్ చూస్తుండగానే మరో సినిమాతో రెడీ అయ్యాడు. సక్సెస్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. సినిమా కోసం చాలా కష్టపడే ఈ హీరో తాజాగా ‘కవచం’ చిత్రంకు కూడా చాలా కష్టపడ్డట్లుగా తెలుస్తోంది. సినిమా ట్రైలర్ చూస్తుంటే పోలీస్ పాత్ర కోసం ఈయన చాలా హోమ్ వర్క్ చేసినట్లుగా అనిపిస్తుంది. శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా శ్రీనివాస్ మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నాడు. ఆ సమయంలో సినిమాలో పాత్ర పేరుకు అమితాబ్ స్ఫూర్తి అంటూ ప్రకటించాడు.‘కవచం’ చిత్రంకు కమిట్ అయినప్పుడు చాలా పోలీస్ సినిమాలు చూశాను. ముఖ్యంగా అమితాబచ్చన్ నటించిన పలు పోలీస్ మూవీస్ ను చూశాను. ఎక్కువ సినిమాల్లో అమితాబ్ విజయ్ అనే పేరుతోనే పోలీస్ గా నటించాడు. అందుకే తమ సినిమాలో కూడా హీరో పాత్రకు విజయ్ అనే పేరు పెట్టినట్లుగా పేర్కొన్నాడు. విజయ్ పేరు పెట్టాలనే ఆలోచనకు ఇతర యూనిట్ సభ్యులు కూడా పాజిటివ్ గా రెస్పాండ్స్ అయ్యారు. తప్పకుండా ప్రేక్షకులు విజయ్ పాత్రను ఆధరిస్తారని బెల్లంకొండ నమ్మకం వ్యక్తం చేశాడు.

ఈ చిత్రంలో హీరోయిన్స్ గా కాజల్ మరియు మెహ్రీన్ లు నటించిన విషయం తెల్సిందే. వీరిద్దరితో పాటు సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు. భారీ నిర్మాణాత్మక విలువలతో రూపొందిన ఈ చిత్రం మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మరికొన్ని గంటల్లో బెల్లంకొండ కవచం పరిస్థితి ఏంటీ అనే విషయమై క్లారిటీ వచ్చేను.