Begin typing your search above and press return to search.

ఈ ​మోటు సరసం ఏంటి గురూ!!

By:  Tupaki Desk   |   27 July 2017 4:57 AM GMT
ఈ ​మోటు సరసం ఏంటి గురూ!!
X
మన దేశంలో కొత్త కథలతో ప్రయోగాలు చేయడంలో ఈ మధ్యన కొందరు మేకర్లు ముందుంటున్నారు. పోలిటికల్ డ్రామా అయినా సెక్స్ డ్రామా అయినా కూడా హిందీ మేకర్స్ కొంచం దైర్యంగానే రచ్చ చేసేస్తున్నారు. ఇప్పుడు కూడా నవాజుద్దీన్ నటించిన బాబూమొషాయ్ బందూక్ బాజ్ సినిమాతో దేశి యాక్షన్ దేశి రొమాన్స్ ను మనం పీక్స్ లో చూడబోతున్నాం.

బాబూమొషాయ్ బందూక్ బాజ్ సినిమా ట్రైలర్ వచ్చి అందరికీ ఒక షాక్ ఇచ్చింది. ఎందుకంటే అందులో ఉండే సీన్స్ కానీ కొన్ని యాక్షన్ సన్నివేశాలు కానీ ఇప్పటి వరకు ఎవరూ సాహసం చేయనవే. అందులోనూ నవాజుద్దీన్ సిద్దికి నటిస్తున్నాడు అంటే ఆ సినిమాలో ఏదో విషయం ఉండే ఉంటుంది అని ఒక నమ్మకంకు వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఒక పాటను విడుదల చేసారు. ఈ సినిమాలో డ్రామా ఎలా ఉంటుందో కానీ 'బర్ఫానీ' అనే పాటలో నవాజుద్దీన్ హీరోయిన్ బిదితా బాగ్ మధ్య లవ్ మేకింగ్ సీన్స్ మాత్రం అందరికి దేశి సెక్స్ ను తలపించేలా చేసింది. ఇటువంటి పాత్రలలో ముందు ఎప్పుడు నవాజుద్దీన్ చేయలేదు కానీ మొదటిసారి ఇంత మోటు సరసం చేసి కాస్త షాకిచ్చాడు. ఇంకా బిదితా బాగ్ కూడా తన చూపులతో సెక్సీ లుక్కులతో అందరికీ అందాల కనువిందు చేసింది.

పాట వినడానికి ఎంత బాగుందో పాట చూడటానికీ అంతే హాట్ గా ఉందిలే. ఘాలిబ్ అసాద్ భోపాలి రాసిన పాటను అర్మాణ్ మాలిక్ కొంపోజ్ చేశాడు. దానికి నవాజుద్దీన్ బిదితా ప్రాణం పోసారు. దివ్య దత్త్ జతిన్ గోస్వామి , శ్రద్ధా దాస్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆగష్టు 25 నాడు బాబూమొషాయ్ బందూక్ బాజ్ విడుదల కాబోతుంది. ఇంత రొమాన్స్ ని తట్టుకోలేక హీరో నవాజుద్దీన్ కూడ ఒక ట్వీట్ రూపంలో తన ఆతృత ను తెలియపరిచాడు.​