Begin typing your search above and press return to search.

వర్మ కొత్త బేబీ దొరికేసింది

By:  Tupaki Desk   |   16 Feb 2019 10:50 AM GMT
వర్మ కొత్త బేబీ దొరికేసింది
X
విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే జంటగా సందీప్‌ వంగ దర్శకత్వంలో రూపొందిన 'అర్జున్‌ రెడ్డి' చిత్రం ఇక్కడ సెన్షేషనల్‌ సక్సెస్‌ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న అర్జున్‌ రెడ్డిని తమిళం మరియు హిందీల్లో రీమేక్‌ చేస్తున్నారు. తమిళంలో 'వర్మ' టైటిల్‌ తో రూపొందుతున్న మూవీ షూటింగ్‌ అంతా పూర్తి అయిన తర్వాత సరిగా రాలేదు అంటూ మొత్తం క్యాన్సిల్‌ చేసి రీషూట్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దర్శకుడు బాలా, హీరోయిన్‌ మేఘా చౌదరిని కూడా తప్పించి మళ్లీ ప్రెష్‌ గా మొదలు పెట్టబోతున్నట్లుగా స్వయంగా నిర్మాతలు ప్రకటించారు.

స్క్రిప్ట్‌ లో మార్పులు చేర్పులు చేయిస్తున్న చిత్ర నిర్మాతలు తాజాగా 'వర్మ' చిత్రం కోసం బాలీవుడ్‌ నటి బానిటా సందును ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. 'అక్టోబర్‌' అనే హిందీ సినిమాతో అలరించిన బానిటా సందు తమిళంలో వర్మ కోసం ఎంపిక అయినట్లుగా బాలీవుడ్‌ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ పేర్కొన్నాడు. 'అర్జున్‌ రెడ్డి' చిత్రం డైరెక్షన్‌ టీంలో సందీప్‌ వంగకు అసోసియేట్‌ గా వర్క్‌ చేసిన గిరీశయ్య ఈ రీమేక్‌ కు డైరెక్టర్‌ గా వర్క్‌ చేయబోతున్నాడు. త్వరలోనే నిర్మాణ సంస్థ నుండి ఈ విషయమై అఫిషియల్‌ గా అనౌన్స్‌ మెంట్‌ రాబోతుంది. ఇక ఈ చిత్రం టైటిల్‌ ను కూడా మార్చే యోచనలో యూనిట్‌ సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది.

తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ ఈ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్న విషయం తెల్సిందే. కొడుకును సక్సెస్‌ తో పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో వర్మ ఇంతకు ముందు షూట్‌ చేసిన ఫుటేజ్‌ ను అంతా కూడా చెత్త బట్టలో పడేయించినట్లుగా తమిళ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.