Begin typing your search above and press return to search.

రానా, బన్నీలకు షాకిచ్చారు

By:  Tupaki Desk   |   7 Feb 2016 7:30 PM GMT
రానా, బన్నీలకు షాకిచ్చారు
X
మన హీరోలకు తమిళనాట షాక్ తగిలింది. అందులో ఒకరికి డైరెక్ట్ దెబ్బ కాగా.. ఇంకొకరికి ఇన్ డైరెక్ట్ పంచ్. ఈ శుక్రవారం విడుదలైన రెండు తమిళ సినిమాలతో మన హీరోలకు సంబంధముంది. అందులో ఒకటి బెంగళూరు నాట్కల్ కాగా.. ఇంకోటి సాహసం. ‘బెంగళూరు నాట్కల్‌’లో రానా దగ్గుబాటి హీరోగా నటించాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘బెంగళూరు డేస్’కు ఇది రీమేక్. బొమ్మరిల్లు భాస్కర్ తొలిసారి తమిళంలో తీసిన సినిమా ఇది. పీవీపీ సంస్థ నిర్మించింది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు కానీ.. టాక్ ఆ స్థాయిలో లేదు. ‘బెంగళూరు డేస్’ మ్యాజిక్ ను రీక్రియేట్ చేయడంలో ఫెయిలయ్యారని అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. రానా గురించి కూడా ఫీడ్ బ్యాక్ ఏమంత బాగా లేదు.

మరోవైపు ప్రశాంత్ హీరోగా నటించిన ‘సాహసం’ సినిమాకు కంప్లీట్ నెగెటివ్ టాక్ వస్తోంది. ఇది అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ‘జులాయి’కి రీమేక్. ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ ఏరి కోరి ఈ సినిమాను తీసుకెళ్లి అరుణ్ రాజ్ వర్మ అనే యంగ్ డైరెక్టర్ తో రీమేక్ చేయించాడు. ఐతే సినిమాను సమీక్షకులు తిట్టిపోస్తున్నారు. ఆడియన్స్ నుంచి కూడా అలాంటి రెస్పాన్సే వస్తోంది. తెలుగులో సూపర్ హిట్ అయిన తన సినిమాకు తమిళంలో ఇలాంటి రెస్పాన్స్ వస్తుండటం బన్నీకి కూడా మింగుడు పడుతుండదేమో. ఈ వారం వచ్చిన మరో సినిమా ‘విసారణై’ ముందు ఈ రెండు రీమేకులూ వెలవెలబోయాయి. వీటి ఫెయిల్యూర్ ఆ సినిమాకు బాగా కలిసొస్తోంది.