Begin typing your search above and press return to search.

బండ్ల రీమేక్ లో హీరో ఫిక్స్?

By:  Tupaki Desk   |   11 Feb 2016 5:49 AM GMT
బండ్ల రీమేక్ లో హీరో ఫిక్స్?
X
రీమేక్ సినిమాలు చేయడంలో వెంకటేష్ కి బోలెడంత అనుభవం ఉంది. ఈ విక్టరీ హీరో చేసిన లేటెస్ట్ అన్నీ పక్క భాష నుంచి తెచ్చుకున్నవే. దృశ్యం - గోపాలా గోపాలా - మసాలా.. చిత్రాలన్నీ రీమేక్ చిత్రాలే. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో బాబు బంగారం అంటూ ఓ స్ట్రయిట్ సినిమా చేస్తున్న వెంకటేష్.. మరో మలయాళ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలస్తోంది.

మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన టూ కంట్రీ చిత్ర హక్కులను టాలీవుడ్ భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ దక్కించుకున్న విషయం తెలసిదే. దిలీప్ - మమతా మోహన్ దాస్ లు జంటగా నటించిన ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం.. భారీ డిమాండ్ నెలకొనడంతో.. ఎక్కువ రేట్ ఇచ్చి కొనుగోలు చేశారు. ఒక మల్లూవుడ్ సినిమాకి ఇప్పటివరకూ ఇవ్వనంత రేట్ టూ కంట్రీస్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఇప్పుడీ సినిమాకి తెలుగు రీమేక్ లో నటించేదుకు వెంకటేష్ ఓకే అన్నాడని తెలుస్తోంది.

ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. టూ కంట్రీస్ రీమేక్ లో వెంకటేష్ నటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వరుసగా సోలో హీరోగా సినిమాలు చేసి, టాలీవుడ్ లో తన స్టార్ డం ని కాపాడుకోవాలని వెంకీ ఆలోచిస్తున్నాడు. అందుకే మల్టీస్టారర్ ల వైపు అసలు వెళ్లడం లేదని తెలుస్తోంది. బాబు బంగారం షూటింగ్ పూర్తయ్యే సమయానికి టూ కంట్రీస్ రీమేక్ సంగతులు ప్రకటించే అవకాశం ఉంది.