ఒప్పుకుంటారా.. బండ్ల మామూలోడు కాదని

Sun Mar 19 2017 10:28:39 GMT+0530 (IST)

బండ్ల గణేష్ ను చూస్తే చాలా అమాయకంగా కనిపిస్తాడు. స్టార్ హీరోల గురించి.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి అతడి పొగడ్తలు వింటే చాలా కామెడీగా అనిపిస్తుంది. అతనేదో ఆవేశంలో.. అపరిపక్వతతో మాట్లాడుతున్నట్లుగా కూడా తోస్తుంది. కానీ ఇదంతా ఒక స్ట్రాటజీ ప్రకారం నడిచే వ్యవహారమని కొంచెం లోతుగా పరిశీలిస్తేనే అర్థమవుతుంది. బండ్ల అంత అమాయకుడైతే 50-60 కోట్ల పెట్టుబడి పెట్టి.. స్టార్ హీరోలు-డైరెక్టర్ల క్రేజీ కాంబినేషన్లో సినిమాలు తీసేయగలడా? తెలంగాణలోనే అతి పెద్ద పౌల్ట్రీ పరిశ్రమను నడపగలడా? బండ్ల ఎంత తెలివైన వాడన్నది అతను ఇటీవల ఇచ్చిన రెండు ఇంటర్వ్యూల్ని పరిశీలిస్తే అర్థమవుతంది.

తాజాగా ‘కాటమరాయుడు’ ఆడియో వేడుకలో బండ్ల ప్రసంగం విన్నా.. అతను మామూలోడు కాడని అర్థమవుతుంది. గతంలో బండ్ల ప్రసంగాలు వింటే ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడేసినట్లు అనిపిస్తుంది కానీ.. అతను ఎంతగా ప్రిపేర్ అయి వస్తాడనడానికి తాజా స్పీచ్ రుజువు. ‘‘బాస్ గురించి ఏం చెప్పాలి.. కళ కళ కోసం కాదు.. ప్రజల కోసం అన్నాడు బళ్లారి రాఘవ. అలాంటాయన అని చెప్పాలా’’ అంటూ మొదలుపెట్టి బాలగంగాధర్ తిలక్.. బీఆర్ అంబేద్కర్.. మహాత్మాగాంధీ.. కందుకూరి వీరేశలింగం.. లాలా లజపతిరాయ్.. ఇలా చాలామంది మహాత్ముల పేర్లను.. వాళ్ల కోట్స్ ను ప్రస్తావించి అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు బండ్ల. ఎవరో చెప్పిన కోట్సే కదా అనిపించొచ్చు కానీ.. వాటన్నింటినీ గుర్తుపెట్టుకుని వచ్చి.. ఒక ఆవేశంతో ఆడియో వేడుకలో వేలాది మంది అభిమానుల ముందు మంచి టైమింగ్ లో చెప్పడం అంటే చిన్న విషయమేదీ కాదు. దీన్ని బట్టే బండ్ల సామాన్యుడు కాదని అర్థం చేసుకోవాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/