Begin typing your search above and press return to search.

కడిగిన ముత్యంలా బయటపడతాడట

By:  Tupaki Desk   |   26 July 2017 6:03 AM GMT
కడిగిన ముత్యంలా బయటపడతాడట
X
ఇప్పుడు దర్శకుడు పూరి జగన్ తనకు తానే స్వయంగా పోస్ట్ పెట్టడం సోషల్ మీడియాలో చాలా ఆసక్తి రేకెత్తించింది. ఎందుకంటే అందులో చాలా నిగూడగుప్తమైన మెసేజ్ లు ఉన్నాయని అర్దమవుతోంది. ఏదో బాగా అలసిపోయిన తరువాత సేద తీరడానికి ఏదన్నా చేసుండొచ్చు.. అంత మాత్రాన తాగి రోడ్డు మీద జనాలను చంపేస్తున్నవారిలా చేయట్లేదు కదా అంటూ అందులో ఒక సారాంశం ఉండటంతో.. అసలు పూరి జగన్ ఈ సందేశం ద్వారా ఏం చెప్పదలిచాడు అనేది ఆలోచించాలి.

వీటన్నింటిపై స్పందించిన నిర్మాత మరియు నటుడు బండ్ల గణేష్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. అసలు టాలీవుడ్ లో డ్రగ్స్ కేస్ అనేదే వెలుగు చూడనప్పుడు.. తనకు తెలిసిన ఒక దర్శకుడు పెద్ద వెధవ అని.. అతను ఎప్పుడూ డ్రగ్స్ మత్తులో తూగుతూ ఉంటాడని కామెంట్ చేశాడు. ఈ సందర్భంగా పూరి జగన్ గురించి చెప్పమంటే.. ''పూరి జగన్ చాలా మంచోడు. ఆయన ఎప్పుడూ పని గురించే ఆలోచిస్తాడు. ఈ డ్రగ్స్ లాంటివి ఎప్పుడూ నేను ఆయన చేస్తుండగా చూడలేదు. కాని ఎవరైనా కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటే రికవర్ అవ్వడం కష్టం. కాని పూరి మాత్రం ఈ డ్రగ్స్ కేసు నుండి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు. ఖచ్చితంగా తన నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాడు'' అంటూ సర్టిఫికేట్లు ఇచ్చేశాడు బండ్ల బాబు.

గతంలో పూరి జగన్ తో ఇద్దరమ్మాయిలతో టెంపర్ వంటి సినిమాలను తీసిన గణేష్.. తన రెబెల్ తరహా మాటలతో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం క్రియేట్ చేస్తూనే ఉంటాడు. మరి ఇప్పుడు మనోడు తాను కామెంట్ చేసిన ఆ డ్రగ్స్ దర్శకుడి పేరు బయటపెడతాడా? ఏమంటావ్ గణేష్?