Begin typing your search above and press return to search.

బండ్ల గణేష్‌ హారర్‌ సినిమా???

By:  Tupaki Desk   |   6 Oct 2015 10:30 PM GMT
బండ్ల గణేష్‌ హారర్‌ సినిమా???
X
బండ్ల గణేష్.. భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఈ బడా నిర్మాత ఇప్పుడో టైటిల్ ని రిజిస్టర్ చేశాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రిజిస్ట్రేషన్ చేయించిన టాలీవుడ్ లో చాలా ప్రశ్నలు రేకెత్తించింది. ఈ మధ్య ట్వీట్లతో తప్ప... మామూలుగా వార్తల్లో కి రాని బండ్ల.. ఇప్పుడు ఒక టైటిల్ తో టాక్ ఆఫ్ టాలీవుడ్ అయిపోయాడు. ఇంతకీ ఆ టైటిల్ ఏంటో తెలుసా.. దేవిశ్రీ.. అవునండీ దేవిశ్రీ అనే పేరుతో టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించాడు బండ్ల గణేష్

దేవిశ్రీ కి సంబంధించిన టాక్ అయితే ఇప్పటివరకూ అఫీషియల్ గా ఏం ప్రకటించలేదు. అలాగని దేవిశ్రీ అంటే.. డీఎస్పీ అని అనుకోవాల్సిన పని లేదు. ఇక్కడ ఆ ఊసే లేదసలు. మారుతీ నానితో తీసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన సక్సెస్ చూశాక... చాలామంది నిర్మాతలకు చిన్ని సినిమాల పై మోజు కలిగింది. అందరూ బైటకు పెట్టకపోయినా.. బండ్ల మాత్రం ఈ విషయాన్ని ఓపెన్ గానే చెప్పేశాడు. స్టార్స్ కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురూ చూసే బదులు.. ఆ మధ్య వచ్చే గ్యాప్ లోనే చిన్న చిత్రాలు తీసేయచ్చనే విషయం అర్ధమైంది. రిస్క్ కూడా తక్కువగానే ఉంటుంది. బ్యానర్ వాల్యూతో వీలైనంతవరకూ రాబట్టేయచ్చు. అందుకే ఇప్పుడు దేవి శ్రీ అనే క్రేజీ టైటిల్ ని పట్టుకొచ్చాడు బండ్ల అంటున్నారు.

అయితే.. ఇది మయూరి - చంద్రిక - నాయకి - గంగ టైప్ లో హారర్ జోనర్ తీయబోయే మూవీ అంటున్నారు. కాసింత మ్యూజికల్ టచ్ కూడా ఉన్న సబ్జెక్ట్ కావడంతో క్యాచీగా ఉండేందుకు.. దేవిశ్రీ అనే టైటిల్ ని ఎంపిక చేశారని చెప్పుకుంటున్నారు. లెటజ్ వెయిట్ అండ్ సీ.. బండ్ల టైటిల్ పై త్వరలోనే ఓ ట్వీట్ చేసేస్తాడు. అసలు విషయం చెప్పేస్తాడు.