Begin typing your search above and press return to search.

వర్మకు వార్నింగ్ ఇచ్చిన బండ్ల గణేష్

By:  Tupaki Desk   |   12 Oct 2015 8:10 AM GMT
వర్మకు వార్నింగ్ ఇచ్చిన బండ్ల గణేష్
X

ఓవైపు పవన్ కళ్యాణ్ అభిమానుల్ని తిడుతూనే.. తనకు మించిన పవన్ ఫ్యాన్ ఇంకెవ్వరూ లేరని చెప్పుకుంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. మరి పవన్ కు తాను అభిమానిని కాదు, భక్తుణ్ని అని చెప్పుకునే బండ్ల గణేష్ ఊరుకుంటాడా? ఊరుకోలేదు. వర్మ మీదికి దండెత్తి వచ్చేశాడు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ అభిమానుల్ని తిట్టిపోస్తూ, వాళ్ల మీద సెటైర్లు వేస్తూ ఉడికిస్తున్న వర్మకు ట్విట్టర్లో తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశాడు బండ్ల. ఇంతకీ వీళ్లిద్దరి మధ్య వార్ కు సంబంధించిన విశేషాలేంటో చూద్దాం పదండి.

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి అడుగుపెట్టి ఈ రోజుకు 19 ఏళ్లు పూర్తయింది. ఈ రోజును పవన్ అభిమానులు ‘వరల్డ్ పవనిజం డే’గా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిపై ఈ ఉదయం కొన్ని ట్వీట్లు చేశాడు వర్మ. ‘‘ఓ పవన్ కళ్యాణ్ అభిమానిగా.. మిగతా ప్రతి అభిమానులందరికంటే నేనే ఎక్కువగా పవన్ కళ్యాణ్ పై కేర్ చూపిస్తాను. ఈ ప్రపంచ పవనిజం డే నాడు.. సర్దార్ గబ్బర్ సింగ్ ‘బాహుబలి’ కంటే మిన్నగా ప్రపంచానికి చేరువవుతుందని బలంగా నమ్ముతున్నా. పవన్ కళ్యాణ్ అర్జెంటీనా, ఐలాండ్, ఆఫ్రికా, మొత్తం అమెరికాలో చాలా ఫేమస్. వరల్డ్ పవనిజం డే సందర్భంగా కంగ్రాట్స్’’ అంటూ ట్వీట్లు చేశాడు వర్మ.

ఐతే ఈ ట్వీట్లతో పాటు ఇంతకుముందు పవన్ ఫ్యాన్స్ ను ఎద్దేవా చేస్తూ వర్మ చేసిన ట్వీట్లను కూడా దృష్టిలో ఉంచుకుని గణేష్.. వర్మకు వార్నింగ్ ఇచ్చాడు. ‘‘మా పవన్ కళ్యాణ్ మీద వచ్చే విమర్శలు మాకు ఊరేగింపులో పడే మల్లె పూల లాంటివి ఆర్జీవీ సార్. సూర్యడి మీద ఉమ్మేస్తే...’’ అంటూట ముందు ఓ ట్వీట్ చేశాడు బండ్ల. ఆ తర్వాత మళ్లీ.. ‘‘ఆర్జీవీ.. మీకు పవన్ ఫ్యాన్స్ మీద అంత కోపం పనికి రాదు. మా లాంటి ఫ్యాన్స్ కి మీరు ముందు నిలబడి నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ఆర్జీవీ.. నా హంబుల్ రిక్వస్ట్. పవన్ కళ్యాణ్ పై రాత్రి పూట ట్వీట్లు చేసి నిద్ర పాడు చేయొద్దు. పగలు ట్వీట్లతో పని చెడగొట్టొద్దు’’ అంటూ మరో ట్వీట్ చేశాడు బండ్ల.

ఈ ట్వీట్ల తర్వాత వర్మ లైన్లోకి వచ్చాడు. పవన్ గురించి తానెప్పుడూ గొప్పగానే మాట్లాడానన్నాడు. అంతటితో ఆగకుండా.. ''పవనిజం పుస్తకంలో ప్రస్తావించిన ఆర్దర్ స్కోపెన్ హెయిర్ ఫిలాసఫీ ఆధారితంగానే నేను వ్యాఖ్యలు చేశారు. నిరక్షరాస్యుల కసం నా అక్షరాస్యతను లెవెల్ ను తగ్గించుకోలేను'' అంటూ పంచ్ వేశాడు. దీనిపై గణేష్ మళ్లీ సెటైర్ వేశాడు.. ''మీరు బాగా చదువుకొని ఉండొచ్చు. కాని మాకు సంస్కారవంతమైన జీవితం ఇచ్చిన పవన్ వివేకవంతుడు'' అన్నాడు. దీనికి బదులుగా వర్మ.. ''నువ్వు అనవసరంగా పవన్ అభిమానులను పాడుచేసి మిస్ డైరెక్ట్ చేస్తున్నావ్. నేను చెప్పినదంతా పవనిజం పుస్తకంలోదే'' అని రిప్లై ఇచ్చాడు. మళ్లీ బండ్ల బాబు.. ‘‘మాకు పుస్తకాలు అక్కర్లేదు.. పవన్ లుక్ మాపై పడితే చాలు'' అంటూ పంచ్ వేసే ప్రయత్నం చేశాడు. మొత్తానికి ఇద్దరి మధ్య ఈ ట్వీట్ల యుద్ధం కొందరికి మజా ఇస్తే.. ఇంకొందరికి చిర్రెత్తేలా చేసింది