Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ కు బండ్ల వింత కండీషన్‌

By:  Tupaki Desk   |   11 Jun 2019 7:26 AM GMT
బిగ్‌ బాస్‌ కు బండ్ల వింత కండీషన్‌
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 చర్చలు ముగింపు దశకు వచ్చాయి. ఇప్పటికే హోస్ట్‌ గా నాగార్జున ఓకే అయ్యాడు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక పార్టిసిపెంట్స్‌ ఎంపిక విషయంలో చర్చలు జరుగుతున్నాయి. మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. రేణు దేశాయ్‌.. కేఏపాల్‌.. బిత్తిరి సత్తి.. సావిత్రి.. శ్రీముఖి.. ఉదయ భాను.. వరుణ్‌ సందేశ్‌ ఇలా ఎంతో మంది పేర్లు వచ్చాయి. కొత్తగా పేర్లు యాడ్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా నటుడు మరియు నిర్మాత అయిన బండ్ల గణేష్‌ ను కూడా బిగ్‌ బాస్‌ నిర్వాహకులు సంప్రదించినట్లుగా తెలుస్తోంది.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిర్మాణంకు దూరంగా ఉంటున్న బండ్ల గణేష్‌ నటుడిగా రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడట. ఇలాంటి సమయంలో బిగ్‌ బాస్‌ వారు ఆయన షోలో పాల్గొంటాడని భావించారు. కాని ఆయన మాత్రం వింత కండీషన్స్‌ పెట్టి బిగ్‌ బాస్‌ కు నో చెప్పిన్నట్లుగా తెలుస్తోంది.

బిగ్‌ బాస్‌ లో ఉన్నా కూడా తనకు వారంలో రెండు మూడు సార్లు అయినా ఫోన్‌ ను ఇవ్వాలని.. తన కుటుంబ సభ్యులతో టచ్‌ లో ఉండేలా తనకు ప్రత్యేక అనుమతించాలని కోరడం జరిగిందట. అందుకు షో నిర్వాహకులు నో చెప్పినట్లుగా తెలుస్తోంది. బిగ్‌ బాస్‌ షో అంటేనే షో లో ఉన్నన్ని రోజులు కుటుంబ సభ్యులకు మరియు బయటి ప్రపంచంకు దూరంగా ఉండటం. అలాంటిది ఫోన్‌ కావాలని అడిగితే ఎలా ఇస్తారని బండ్ల బాబు అనుకున్నాడో. ఆసక్తి లేక అలాంటి కండీషన్‌ పెట్టి ఉంటాడు.