Begin typing your search above and press return to search.

రీమేక్ కి రంగం సిద్ధం చేసిన బండ్ల

By:  Tupaki Desk   |   10 Feb 2016 3:30 PM GMT
రీమేక్ కి రంగం సిద్ధం చేసిన బండ్ల
X
టాలీవుడ్ లో భారీ చిత్రాల నిర్మాతగా గుర్తింపు పొందిన బండ్ల గణేష్.. ఈ మధ్య బాగా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. గతంలో ఏడాదికి మూడు చొప్పున భారీ సినిమాలు తీసిన రికార్డ్ ఉన్న బండ్ల.. రెండేళ్లుగా ఒక్కో సినిమాతోనే సరిపెట్టేసుకున్నాడు. గతేడాది వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ తర్వాత.. ఇప్పటివరకూ మూవీ కూడా స్టార్ట్ చేయలేకపోయాడు.

స్టార్ హీరోలందరూ బిజీగా ఉండడంతో.. బండ్లకు ఎవరూ డేట్స్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో మంచి ఐడియా వేశాడు ఈభారీ ప్రొడ్యూసర్. ప్రస్తుతం రీమేక్ ల సీజన్ నడుస్తుండడం, స్టార్ హీరోలంతా రీమేక్ లపై డిపెండ్ అవుతుండడంతో.. తను కూడా ఓ సూపర్ హిట్ మూవీకి రైట్స్ కొనేశాడు. మళయాళంలో దిలీప్ - మమతా మోహన్ దాస్ లు జంటగా నటించిన టూ కంట్రీస్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. 50కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఇండస్ట్రీ రికార్డులకు రీచ్ అయింది. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు గట్టి పోటీనే ఏర్పడింది.

అయితే.. భారీ పోటీ మధ్య భారీ రేట్ ఇచ్చి టూ కంట్రీస్ రైట్స్ కొనేశాడు బండ్ల గణేష్. ఈ మూవీ రీమేక్ లో నటించేందుకు టాప్ స్టార్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. తెలుగులో భారీ కమర్షియల్ ఎంటర్టెయినర్ గా ఈ రీమేక్ ఉంటుందని చెబుతున్నాడు బండ్ల గణేష్. ఇప్పటికే టాక్స్ జరుగుతున్నాయని.. త్వరలో నటీనటులతో పాటు టెక్నికల్ టీం డీటైల్స్ కూడా చెబుతానన్నాడు ఈ భారీ చిత్రాల నిర్మాత.