Begin typing your search above and press return to search.

గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ ఆపేయమన్నారు!!

By:  Tupaki Desk   |   22 July 2016 8:48 AM GMT
గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ ఆపేయమన్నారు!!
X
బాలయ్య అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న సినిమా, నందమూరి అభిమానులు, బాలకృష్ణ సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన సినిమా, బాలయ్య వందో సినిమా "గౌతమీపుత్ర శాతకర్ణి" షూటింగ్ ఆపేయమన్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షాక్ కి గురయ్యారు! అయితే ఈ సినిమా షూటింగ్ ను స్వయంగా బాలయ్యే ఆపేయమన్నారని తెలియడంతో ఆ షాక్ మరింత తీవ్రమైంది. కాగా అసలు విషయం తెలుసుకున్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

విషయానికొస్తే... బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ ను బాలయ్య ఆపేయమన్నారు. దీనికి కారణం.. ఆ సినిమా దర్శకుడు క్రిష్ కి పెళ్లి ఫిక్సవడమేనట! గతనెలలోనే డైరెక్టర్ క్రిష్ కు, హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రమ్య కు నిశ్చితార్ధం జరిగింది. అనంతరం ఆగస్టు 8న వీరి వివాహం జరగనుంది. అయితే పెళ్లికి ఇంకా చాలా తక్కువ సమయం ఉన్నా కూడా క్రిష్ సినిమా పనిలోనే బిజీగా ఉంటున్నాడట. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య స్వయంగా జోక్యం చేసుకుని.. షూటింగ్ ఆపేయమన్నారట. ఇది అసలు విషయం!!

ప్రస్తుతం ఈ సినిమాకు షూటింగ్ జార్జియాలో జరుగుతుంది. సుమారు వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ స్థాయిలో ఈ సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. కాగా మరో రెండ్రోజుల్లో క్రిష్ జార్జియా నుంచి హైదరాబాద్ కు రాబోతున్నారు. ప్రస్తుతం క్రిష్ పెళ్లికి సంబందించిన పనులు పూర్తయ్యాక, మరికొన్ని రోజులు విరామం అనంతరం తిరిగి షూటింగ్ ప్రారంభమవుతుంది. అన్నీ అనుకూలంగా జరిగితే.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు!