Begin typing your search above and press return to search.

బాలయ్య ఛాయస్ ఎవరో?

By:  Tupaki Desk   |   17 Jan 2019 5:32 AM GMT
బాలయ్య ఛాయస్ ఎవరో?
X
ఎన్టీఆర్ కథానాయకుడుతో కంటెంట్ సక్సెస్ ని కమర్షియల్ ఫెయిల్యూర్ ని ఒకేసారి అందుకున్న నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోవడం లేదని ఇన్ సైడ్ టాక్. మహానాయకుడు ఫిబ్రవరిలోనే విడుదల చేయాలా లేక ఎన్నికల తర్వాత వదలాలా అనే చర్చలు క్రిష్ అండ్ టీం తో జరుగుతున్నట్టు సమాచారం. అదలా ఉంచితే ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బోయపాటి శీను తన నెక్స్ట్ మూవీ బాలయ్యతోనే ఉంటుందని ఫిబ్రవరిలో మొదలుపెడతామని ప్రకటించాడు. అప్పటికి వినయ విధేయ రామ ఫలితం తెలియదు కాబట్టి సింహ-లెజెండ్ లను గుర్తు చేసుకుని ఫ్యాన్స్ సంబరంగా ఫీలయ్యారు.

అయితే మరో ఇంటర్వ్యూలో ఎఫ్2తో మరో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడి బాలయ్య కోసం కథ సిద్ధం చేస్తున్నానని ఎప్పుడైనా ఉండొచ్చని చెప్పాడు. సో ఈ ఇద్దరిలో ఎవరితో ఉండొచ్చనే సస్పెన్స్ అయితే వీగిపోలేదు. నందమూరి అభిమానుల అభిమతం మరోలా ఉంది. ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు కాబట్టి అనిల్ రావిపూడితోనే చేయాలని కోరుతున్నారు.వినయ విధేయ రామ చూసాక బోయపాటి టేకింగ్ లో క్వాలిటీ చాలా తక్కువ స్థాయిలో పడిపోయిందని అందుకే అది వాయిదా వేయాలని కోరుతున్నారు.

అయితే ఒక ఫ్లాప్ వచ్చిందనో లేక హిట్ కొట్టారనో తరువాత సినిమాకు అదే ఫలితం దక్కుతుందని ఊహించుకోవడం కరెక్ట్ కాదు. అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ అరవింద సమేతతో బౌన్స్ బ్యాక్ అయిన ఉదాహరణ ఇంకా ఫ్రెష్ గానే ఉంది కదా. సో బాలయ్య మాస్ పల్స్ కరెక్ట్ గా తెలిసిన బోయపాటితో స్క్రిప్ట్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మరో మాస్ మసాలా హిట్ కొట్టొచ్చు. అయితే బాలకృష్ణ మనసులో ఏముందో మాత్రం తెలియాలంటే ఇంకొద్ది రోజులు పట్టేలా ఉంది.