ఎన్టీఆర్ బయోపిక్.. అన్నీ మలుపులే

Mon Sep 04 2017 09:54:15 GMT+0530 (IST)

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రపై బయోపిక్ తీయాలన్నది నందమూరి బాలకృష్ణ కల. కొన్ని వారాలుగా ఈ బయోపిక్ బాగా హాట్ టాపిక్ అయిపోయింది. పైగా స్వయంగా బాలయ్యే తన మరుసటి చిత్రం అదే అన్నట్లుగా ఇండికేషన్స్ ఇవ్వడంతో.. విపరీతమైన చర్చ జరిగింది. విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యవహార శైలి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వివాదాస్పదంగా ఉన్న కథలను ఎంచుకొని అక్కడే సినిమాకి కావల్సిన పబ్లిసిటీ రాబట్టుకుంటాడు. ప్రస్తుత రోజుల్లో ఇంకా ఆయన సినిమాలను ఇష్టపడే వాళ్ళు చాలా మందే ఉన్నారని చెప్పాలి.

ఎన్టీఆర్ బయోపిక్ కు తానే డైరెక్టర్ అంటూ రామ్ గోపాల్ వర్మ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అంతే కాదు.. ఓ థీమ్ సాంగ్ ను కూడా రికార్డ్ చేయించేశాడు. అయితే.. ఈ విషయంపై సస్పెన్స్ ఇప్పటివరకూ కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ రీసెంట్ గా పైసా వసూల్ రిలీజ్ సందర్భంగా బాలయ్య పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఎన్టీఆర్ బయోపిక్ డైరెక్టర్ గా వర్మను తీసుకున్నారనే అంశంపై తేల్చి చెప్పేశారు. "ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకుడుగా ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది. ఆయనతో అనుబంధం ఉన్న పలువురిని నేనే  స్వయంగా సంప్రదిస్తున్నాను. ఎన్టీఆర్ మూవీని ఎక్కడ స్టార్ట్ చేయాలి.. ఎక్కడ ముగించాలి అనే అంశంపై నాకు స్పష్టమైన ఐడియా ఉంది. ఎవరూ దీనిపై ఎలాంటి ప్రచారాలు చేయాల్సిన పని లేదు" అని చెప్పేశారు బాలయ్య.

పైగా రానా టీవీషో నెంబర్ 1 యారీకి పూరీతో పాటు వచ్చిన బాలకృష్ణ.. వర్మ ఓ ప్రత్యేకమైన జోనర్ అంటూ తనకు సరిపడదు అనే విధంగా చెప్పడం గమనించవచ్చు. వర్మ శిష్యుడు పూరీ జగన్నాధ్ తో జత కట్టిన బాలకృష్ణ.. ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో పూరీ గురువుకు అవకాశం ఇవ్వడం కష్టమే కావచ్చనే టాక్ ఇప్పుడు ఎక్కువైంది. ఎన్నో ఊహించని మలుపులున్న ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కించాలంటే చాలా గట్స్ ఉండాలి. అలాంటి దైర్యం వర్మకి ఉందని అంటున్నారు చాలా మంది. ఒక వేళ వేరే వాళ్ళు తీస్తే అంతబాగా రకపోవచ్చని కూడా అంటున్నారు. కానీ వర్మ పరాజయాలను దృష్టిలో ఉంచుకొని బాలయ్య సన్నిహితులు ఆయనతో వద్దని చెబుతున్నారట. మరి ఈ కథని ఎవరూ తెరకెక్కిస్తారు అనే దానిపై బాలయ్య ఎప్పుడు స్పష్టత ఇస్తారో చూడాలి. అప్పటివరకు ఈ వార్త రోజుకో మలుపు తిరుగుతూనే ఉంటుంది.