ఫోటో స్టోరీ : బాలయ్య 'వేటగాడు' లుక్

Mon Oct 22 2018 13:18:33 GMT+0530 (IST)

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర తో ‘ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో బాలకృష్ణ లుక్ ఇప్పటికే రివీల్ అయ్యింది. ఎన్టీఆర్ కు చెందిన పలు కీలక గెటప్స్ లో బాలయ్య ఇప్పటికే అదరగొట్టాడు. సినిమాపై అంచనాలు పెంచే విధంగా ప్రతి ఒక్క పోస్టర్ ఉంది. తాజాగా ‘వేటగాడు’ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ రివీల్ అయ్యింది. అచ్చు ఎన్టీఆర్ దిగిపోయినట్లుగా ఈ పోస్టర్ ఉంది. ఎన్టీఆర్ చిత్ర కెరీర్ లో వేటగాడు చాలా కీలకంగా చెప్పుకుంటారు. ఆ చిత్రంతో ఎన్నో రికార్డులను ఎన్టీఆర్ దక్కించుకున్నారు.అందుకే ఆ చిత్రంను ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో కీలకంగా చూపించబోతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ కు జోడీగా అప్పట్లో చేసిన శ్రీదేవి పాత్రలో  రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేయడం బాలయ్య రకుల్ ల కాంబినేషన్ లో ఆకుచాటు పిందె తడిసే పాటను కూడా చిత్రీకరించారు. ఇంకా వేటగాడు చిత్రానికి సంబంధించిన కొన్ని సీన్స్‌ను కూడా ‘ఎన్టీఆర్’లో పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

క్రిష్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంను సంక్రాంతి కానుకగా మొదటి పార్ట్ ను - అదే జనవరిలో రిపబ్లిక్ డే సందర్బంగా రెండవ పార్ట్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రంపై ఉన్న అంచనాల నేపథ్యంలో అన్ని ఏరియాల్లో కూడా భారీగా బిజినెస్ అవుతోంది. ఎన్టీఆర్ నుండి వస్తున్న ఒక్కో పోస్టర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తూనే ఉన్నాయి.