శాతకర్ణి బెనిఫిట్ షో టిక్కెట్ అక్షరాలా లక్ష గురూ!

Thu Jan 12 2017 10:19:24 GMT+0530 (IST)

బాలకృష్ణ వందో సినిమా "గౌతమీపుత్ర శాతకర్ణి" ఈరోజు విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అభిమానుల అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే సినిమాను కేవలం సినిమాగానే చూడకుండా.. ఆ సినిమా ద్వారా సోషల్ వర్క్ కార్యక్రమాలలో పాలుపంచుకోవడం కూడా చాలా అరుదైన సందర్భాలలో జరుగుతూ ఉంటుంది. తాజాగా బాలయ్య వీరాభిమాని ఇదేపనిచేశారు. ఈ సినిమా టిక్కెట్ కు భారీమొత్తంలో సొమ్ము చెల్లించి దాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగపడేలా చేశాడు!

బాలయ్య వందో సినిమా చూసేందుకు అతని వీరాభిమాని గోపీచంద్ ఇన్నమూరి అక్షరాలా ఒక లక్షా వంద రూపాయలు ఖర్చు పెట్టాడు. హైదరాబాద్ భ్రమరాంబా థియేటర్ లో ఈ సినిమా ప్రీమియర్ షో టికెట్ కోసం ఇంత మొత్తం చెల్లించి బాలయ్యపై తన అభిమానాన్ని ఈ విధంగా చూపించాడు. అయితే బాలకృష్ణ లాగే ఈ లక్షరూపాయలను బెనిఫిట్ షో నిర్వాహకులు ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా అందజేయనున్నారు. ఈ సినిమా ప్రీమియర్ షో నిర్వాహకులైన "మన బాలయ్య డాట్ కాం" నవీన్ మోపర్తి... ఈ టికెట్ ను హీరో నారా రోహిత్ చేతులమీదుగా బాలయ్య అభిమాని గోపీచంద్ ఇన్నమూరి కి అందజేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/