పొగను పంచుకున్న స్నేహం - ఎన్టీఆర్ విత్ ఎన్నార్

Thu Sep 20 2018 16:59:58 GMT+0530 (IST)

స్టార్ హీరోలకు సంబంధించి ఇప్పుడు అందరూ స్నేహపూర్వకంగానే ఉన్నా ఎప్పటికి ఆదర్శంగా చెప్పుకునేది మాత్రం ఎన్టీఆర్-ఎన్నార్  ల బంధమే. ఇద్దరి మధ్య సై అంటే సై అనుకునే బాక్స్ ఆఫీస్ పోటీ ఎంత ఉన్నా బయట మాత్రం ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మెలిగేవారని వీళ్ళ ఫ్రెండ్ షిప్ ని దగ్గరనుంచి చూసినవాళ్ళు ఇప్పటికీ కథలుగా చెబుతారు. ఇవాళ ఏఎన్నార్ జయంతి సందర్భంగా ఉదయం నాగేశ్వర్ రావు గారిలా ఉన్న సుమంత్ లుక్ ని చూసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యారు. తాతయ్యను దాదాపు దింపేసాడే అనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. సోషల్ మీడియాలో సైతం సుమంత్ ఇవాళ బాగా హై లైట్ అయ్యాడు. ఈ ఉత్సాహాన్ని రెట్టింపు చేయాలనీ కాబోలు టీమ్ వెంటనే ఎక్కువ ఆలస్యం చేయకుండా మరో పోస్టర్ కూడా వదిలింది. అందులో సుమంత్ తన నోట్లో సిగరెట్ వెలిగించుకుని పొగను బాలయ్యకు పంచుతుండగా క్రిష్ మార్క్ తో అబ్బో సూపర్ అనుకునేలా ఉంది.నిజానికి ఇది కల్పన కాదు. వాస్తవంగానే ఈ ఇద్దరు ఇంత చనువుగా కలిసి పొగ తాగిన ఫోటోలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకునే క్రిష్ ఈ సన్నివేశాన్ని పొందుపరిచాడు. దాంతో పోల్చి చూసుకున్నా ఆశ్చర్యం కలగక మానదు. అంత సహజంగా వచ్చేలా చేయడంలో క్రిష్ సక్సెస్ అయ్యాడు. ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ పాత్ర ఎంత లెంగ్త్ ఉంటుంది అనే వివరాలు బయటికి చెప్పలేదు కానీ మొత్తానికి నందమూరి అభిమానులకు అక్కినేని ఫ్యాన్స్ కు ఇద్దరికీ గూస్ బంప్స్ ఇచ్చే వాటికి లోటు ఉండబోదని మాత్రం అర్థమైంది. ప్రమోషన్ విషయంలో చాలా ప్లాన్డ్ గా ఒక్కో లుక్ ని రివీల్ చేస్తున్న ఎన్టీఆర్ టీమ్ త్వరలో బసవతారకం గారి పాత్ర చేసిన విద్యా బాలన్ లుక్ ని విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. జనవరిలో విడుదల కానున్న ఎన్టీఆర్ గురించి ఇప్పుడే ఇన్ని విశేషాలు తెలుస్తుంటే రానున్న రోజుల్లో ఇంకెన్ని సర్ప్రైజ్ లతో ముంచెత్తుతాడో.