Begin typing your search above and press return to search.

నంద‌మూరి ఫ్యామిలీకో వ‌ర్మ‌ కావాలి

By:  Tupaki Desk   |   26 April 2018 11:30 AM GMT
నంద‌మూరి ఫ్యామిలీకో వ‌ర్మ‌ కావాలి
X
ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో వ‌ర్మ చేసింది త‌ప్పే, కానీ అలా చేసినందుకు చాలా థ్యాంక్స్ వ‌ర్మ అని చెబుతున్నారు ల‌క్ష‌ల మంది మెగా ఫ్యాన్స్‌. వారంతా వ‌ర్మపై విషం క‌క్కేంత కోపం ఉన్నా... అత‌ను చేసిన ప‌ని వ‌ల్ల మెగా ఫ్యామిలీ ఒక్కటైనందుకు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇక నంద‌మూరి కుటుంబం కోసం మ‌రో వ‌ర్మ పుట్టుకొస్తే బాగుండున‌ని కోరుకుంటున్నారు నంద‌మూరి అభిమానులు.

శ్రీరెడ్డి విష‌యం అంద‌రికీ తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం అంటూ బ‌య‌టికి వ‌చ్చిన ఆమె వ‌ర్మ మాట‌ల‌కి లొంగిపోయి ప‌వ‌న్ ను ప‌చ్చిబూతులు తిట్టింది. వ‌ర్మ కూడా శ్రీరెడ్డి చేత ప‌వ‌న్ తిట్టించింది తానేనంటూ బ‌య‌ట‌పెట్టుకున్నాడు. ఇది జ‌రిగిన నాలుగురోజుల‌కి ప‌వ‌న్ ఆత్మ గౌర‌వం అంటూ అమ్మ‌ను తిట్టారంటూ ఫిల్మ్ చాంబ‌ర్ కు వ‌చ్చి కాసేపు ర‌చ్చ చేశారు. ఒక్క రోజు టైమిస్తా ఏం చేస్తారో చేయండి అంటూ సినీ పెద్ద‌ల‌కు అల్టిమేటం జారీ చేశాడు. ప‌వ‌న్ బాగా ఫీల‌య్యాడ‌ని తెలిసినా అల్లు అర‌వింద్ అల్లు అర్జున్ రామ్ చ‌ర‌ణ్ నాగ‌బాబు వీరంతా ఫిల్మ్ ఛాంబ‌ర్‌ కు వ‌చ్చి ప‌వ‌న్ కు అండ‌గా నిల్చున్నారు. అల్లు అర్జున్ మామ‌య్యను హ‌త్తుకున్నాడు కూడా. అది చూసి మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు. ఎందుకంటే అల్లు అర‌వింద్ అల్లు అర్జున్ - ప‌వ‌న్ కళ్యాణ్ మ‌ధ్య సంబంధాలు అంత‌గా బాగోలేవు. వారు చాలా రోజులుగా మాట్లాడుకోవ‌డం లేదు కూడా. ఇలాంట‌ప్పుడు వ‌ర్మ కార‌ణంగా ఫ్యామిలీ మ‌ళ్లీ ఒక్క‌తాటిపైకి వ‌చ్చింది. త‌మ మ‌ధ్య ఎన్ని గొడ‌వ‌లున్నా తామంతా ఒక్క‌టేన‌ని నిరూపించారు.

నందమూరి అభిమానులు వ‌ర్మ‌లా గొడ‌వ‌లు సృష్టించే వ్య‌క్తి త‌మ‌కు కావాల‌ని కోరుకుంటున్నారు. నంద‌మూరి కుటుంబంలో కూడా బాల‌య్య - జూనియ‌ర్ ఎన్టీఆర్ కుటుంబాల మ‌ధ్య దూరం బాగా పెరిగిపోయింది. బాల‌య్య ఇంటి వేడుక‌ల‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ హాజ‌రుకాలేదు. అలాగే జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమా లాంచ్‌ కు ఇత‌ర వేడుక‌ల‌కు బాల‌య్య కుటుంబం కూడా రాదు. వీరిద్ద‌రినీ క‌లిపేలా ఎవ‌రైనా ఏదైనా చేస్తే బాగుంటుంద‌ని కోరుకుంటున్నారు నంద‌మూరి అభిమానులు.