Begin typing your search above and press return to search.

ఇంకా సాగుతున్న 100వ హీరోయిన్‌ వేట

By:  Tupaki Desk   |   3 May 2016 5:30 PM GMT
ఇంకా సాగుతున్న 100వ హీరోయిన్‌ వేట
X
నందమూరి బాలకృష్ణ తన వందో సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని ప్రారంభించేశారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీకి.. ఈ నెల 9వ తేదీ నుంచి మొరాకోలో షూటింగ్ కూడా స్టార్ట్ చేసేయనున్నారు. మొదటగా వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించనుండగా.. ఇప్పుడీ సినిమాలో హీరోయిన్ కోసం వేట ఊపందుకుంది.

గౌతమిపుత్ర శాతకర్ణి హీరోయిన్ గా మొదట నయనతారను అనుకున్నారు. కానీ కాల్షీట్స్ కేటాయించడంలో ఇబ్బంది కారణంగా.. ఈ మలయాళీ భామ తప్పుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ యువరాణి కాజల్ ను సంప్రదించాడు దర్శకుడు క్రిష్. కానీ ఆమెకు ఆఫర్ చేసిన రెమ్యూనరేషన్ నచ్చకపోవడంతో.. చందమామ కూడా చేయనని చెప్పేసింది. ఆ తర్వాత గోవా బ్యూటీ ఇలియానాను సంప్రదించారు కానీ.. ఇది చాలా మెచ్యూర్డ్ అని, అంతటి కేరక్టర్ చేయలేనని తేల్చేసింది ఇల్లీ బేబీ.

మెయిన్ హీరోయిన్స్ అంతా ఇలా బాలయ్య సినిమా విషయంలో ఆసక్తి చూపకపోవడంతో వేరే ఆప్షన్స్ వెతుక్కోవాల్సి వచ్చింది. తమన్నా, రకుల్ ప్రీత్ లాంటి హీరోయిన్స్ బాలయ్య పక్కన సరిపోయే ఛాన్స్ లేదు. అందుకే కొత్త హీరోయిన్స్ ని అయినా పరిశీలించమని బాలయ్య చెప్పారట. కానీ డైరెక్టర్ మాత్రం సీనియర్ నటీమణి అయితేనే పాత్రకు న్యాయం జరుగుతుందని భావించడంతో.. తన ప్రయతాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడంటున్నారు. ప్రస్తుతం శృతి హాసన్ ని ఈ రోల్ కి ఒప్పించేందుకు క్రిష్ ప్రయత్నిస్తున్నాడన్నది సమాచారం.