ప్రేక్షకులతో సినిమా చూసిన 'శాతకర్ణి'

Thu Jan 12 2017 11:40:27 GMT+0530 (IST)

తనవందో సినిమాపై బాలకృష్ణ ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో వాటికి రెట్టింపుగా భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యే అవకాశాలున్నాయని కూడా భావించారు. అయితే ఈరోజు విడుదలయిన గౌతమీపుత్ర శాతకర్ణి మార్నింగ్ షో రిపోర్ట్ ప్రకారం.. అటు బాలయ్య ఇటు అభిమానులు ఈ సినిమా ఫలితంపై ఫుల్ హ్యాపీగా సంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. ఈ సంబరాల సంగతి అలా ఉంచితే... ఈ సినిమాను అభిమానుల సమక్షంలో చూడాలని భావించారు బాలకృష్ణ.

"గౌతమి పుత్రశాతకర్ణి" సినిమాను ప్రేక్షకులతో కలిసి చూడాలని భావించిన నందమూరి బాలకృష్ణ... భ్రమరాంభ థియేటర్ లో బెనిఫ్టి షో కి హాజరయ్యారు. అభిమానుల సమక్షంలో తన వందో సినిమాని వీక్షించారు. స్వయంగా బాలయ్యే సినిమా చూడటానికి రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాలయ్య సినిమా విడుదల సందర్భంగా అభిమానుల హడావిడి బాణసంచా పేళుల్లతో సంబరాలతో థియేటర్ ప్రాంగణం మారుమ్రోగిపోగా.. స్వయంగా బాలకృష్ణ ప్రత్యక్షం అయ్యేసారికి వారి సంబరాలను తారాస్థాయికి వెళ్లిపోయాయి. ఈ సందర్భంగా ఈ సినిమాకు బాలయ్యతో పాటు అనేక మంది సినీ ప్రముఖులు హాజరై సినిమాను వీక్షించారు. దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి - కొరటాల శివలతో పాటు హీరో నారా రోహిత్ కూడా థియేటర్లో కనిపించిన ప్రముఖుల్లో ఉన్నారు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/