మహేష్ వెర్సస్ బాలయ్య.. రెండుసార్లు

Mon Jun 19 2017 15:26:08 GMT+0530 (IST)

ఇప్పటిదాకా మహేష్ బాబు.. నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర తలపడ్డ దాఖలాలు దాదాపుగా లేవు. ఐతే ఈ ఏడాది తొలిసారిగా వాళ్లిద్దరి మధ్య బాక్సాఫీస్ వార్ జరగబోతోంది. ఈ దసరాకు మహేష్ బాబు సినిమా ‘స్పైడర్’.. బాలయ్య మూవీ ‘పైసా వసూల్’ మధ్య పోరు జరగబోతోందన్న సంగతి తెలిసిందే.

బాలయ్య సినిమాను మొదలుపెట్టే ముందే సెప్టెంబరు 29న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. షూటింగ్ కూడా అనుకున్న ప్రకారమే జరుగుతుండటంతో రిలీజ్ డేట్లో మార్పులేమీ చోటు చేసుకునే అవకాశాలు కనిపించట్లేదు. మరోవైపు వేసవిలోనే విడుదల కావాల్సిన ‘స్పైడర్’ వాయిదాల మీద వాయిదాలు పడి దసరాకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఐతే మరోసారి సినిమా వాయిదా పడే అవకాశాల్లేవు. సెప్టెంబరు 27న ఈ చిత్రం రిలీజవుతుందని సమాచారం. కాబట్టి దసరాకు మహేష్ వెర్సస్ బాలయ్య పక్కా అన్నమాటే.

ఐతే మహేష్-బాలయ్య పోరు దసరాకు మాత్రమే పరిమితం కావట్లేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా వీరి మధ్య పోరు ఉంటుందన్నది తాజా సమచారం. ‘పైసా వసూల్’ తర్వాత బాలయ్య చేయబోయే సినిమాను సంక్రాంతికే విడుదల చేస్తారట. తమిళ సీనియర్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ జులై 10 షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాను ఐదు నెలల్లోనే పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేసే ప్రణాళికల్లో ఉన్నారట. స్క్రిప్టు పక్కాగా ఉండటంతో షూటింగ్ ఆలసమ్యమయ్యే అవకాశాల్లేవంటున్నారు. ‘స్పైడర్’ తర్వాత మహేష్ మూవీ ‘భరత్ అను నేను’ ఇప్పటికే సెట్స్ మీదికి వెళ్లిపోయింది. ఈ చిత్రాన్ని జనవరి 11న రిలీజ్ చేయబోతున్నట్లు ముందే ప్రకటించారు. ఐతే సంక్రాంతికి మహేష్.. బాలయ్య మాత్రమే కాదు.. చరణ్ కూడా రేసులో ఉండటం విశేషం. చరణ్-సుకుమార్ మూవీ ‘రంగస్థలం 1985’ని కూడా పొంగల్ కే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/