Begin typing your search above and press return to search.

చిరుతో రిలేషన్.. బాలయ్య స్పందనిది!

By:  Tupaki Desk   |   18 Jan 2017 1:31 PM GMT
చిరుతో రిలేషన్.. బాలయ్య స్పందనిది!
X
ఈ ఏడాది జనవరి 11 నుంచి మొదలు అంతా సంక్రాంతి సంబరాల్లో ఉన్నారు, మరి కొంతమంది సినిమా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే.. తమ అభిమాన హీరోని అభిమానించుకోవడంలో వక్రమార్గాలు పడుతూ రాక్షసానందం పొందుతున్నారు మరికొంతమంది. పలానా హీరో అభిమాని అంటూ మరో హీరోపై దుమ్మెత్తి పోయడం ఈమధ్య "అదో రకం అభిమానం"! అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ ఇచ్చిన ఒక స్టేట్ మెంట్ అభిమానులకు కనువిప్పు కలిగించేలా ఉంది.

తాజాగా ఒక ముఖాముఖిలో చిరు గురించి మరింత పాజిటివ్ గా మాట్లాడిన బాలయ్య అందరూ ఆశ్చర్యపోయేలా స్పందించారు. తెలుగు సినీ పరిశ్రమలో తనకున్న ఏకైక స్నేహితుడు చిరంజీవే అని బాలయ్య స్టేట్మెంట్ ఇచ్చారు. సంక్రాంతికి విడుదలయిన తన "గౌతమీపుత్ర శాతకర్ణి", చిరు "ఖైదీ నెంబర్ 150" మధ్య తీవ్ర పోటీ నెలకొనడంపై స్పందిస్తూ... అగ్ర హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలన్నది తన అభిప్రాయమని మొదలుపెట్టిన బాలయ్య తనకు చిరంజీవితో మంచి సంబంధాలున్నాయని, ఇండస్ట్రీలో తనకు అత్యంత సన్నిహితుడైన ఏకైక వ్యక్తి చిరంజీవే అని చెప్పారు.

ఈ స్టేట్ మెంట్ పై స్పందించిన పలువురు... ఆ హీరోలిద్దరూ అంత స్నేహితులుగా ఉంటుంటే, అభిమానులు అని చెప్పుకునే ఒక బ్యాచ్ మాత్రం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు! ఈ సమస్యలపై ఈ స్థాయిలో స్పందించిన బాలయ్యను అభినందిస్తున్నారు!!

కాగా, రకరకాల పేర్లతో గత కొన్ని రోజులుగా ఆన్ లైన్ వేదికగా అభిమానంలో కొత్త కోణంతో చెలరేగిపోతున్నారు ఒకరకం జనం. అయితే ఆ ఇద్దరు హీరోలు మాత్రం ఒకరి మంచి మరొకరు కోరుకుంటున్నారు. తాజాగా "గౌతమీపుత్ర శాతకర్ణి" ప్రారంభోత్సవానికి హాజరవడమే కాక ఆ సినిమా బాగా ఆడాలని తన "ఖైదీ నెంబర్ 150" ప్రి రిలీజ్ ఈవెంట్ వేదికగా ఆకాంక్షించాడు చిరంజీవి. ఇదే క్రమంలో చిరు సినిమా కూడా బాగా ఆడాలని కోరుకున్నాడు బాలయ్య. అనుకున్నట్లుగానే ఈ రెండు సినిమాలు విడుదలయ్యి వారి వారి ఆకాంక్షల మేర రెండు సినిమాలు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నాయి. కానీ... వారి అభిమానులనబడే బ్యాచ్ లు మాత్రం రచ్చ రచ్చ చేస్తూ వారి వారి అభిమాన హీరోల పరువు ఆన్ లైన్ వేదికగా తీసేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/