Begin typing your search above and press return to search.

బాల‌య్య ఫ్యాన్స్ స‌త్తా చూపించారుగా..

By:  Tupaki Desk   |   21 Jan 2017 4:54 PM GMT
బాల‌య్య ఫ్యాన్స్ స‌త్తా చూపించారుగా..
X
‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’ పోస్ట్ రిలీజ్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా అమెరికాలో అడుగుపెట్టిన బాల‌య్య గొప్ప స్వాగ‌త‌మే ప‌లికారు నంద‌మూరి ఫ్యాన్స్. ‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’ టీంతో క‌లిసి శుక్ర‌వారం అమెరికాలో అడుగుపెట్టిన బాల‌య్య‌కు అభిమానులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. డ‌ల్లాస్ ఎయిర్ పోర్టులో బాల‌య్య దిగేస‌రికి అక్క‌డ వంద‌లాది మంది అభిమానులు పోగ‌య్యారు. ఆయ‌న‌కు ఘ‌న స్వాగతం ప‌లికారు. ఎయిర్ పోర్టు నుంచి బ‌య‌టికి రాగానే బాల‌య్య కోసం బ‌స్సు లాంటి భారీ ల‌గ్జ‌రీ కారు సిద్ధం చేసి పెట్టారు. అందులో బాల‌య్య ఎక్కి అభిమానుల‌కు అభివాదం చేస్తూ సాగుతుంటే ముందు వెనుక 40-50 కార్లు.. బైకులు కాన్వాయ్ గా సాగాయి. ఈ హంగామా అంతా బాల‌య్య అభిమానుల‌కు భ‌లే సంతోషాన్నిచ్చింది. బాల‌య్య‌కు అమెరికాలో ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో ఈ ర్యాలీతో అంద‌రికీ తెలిసింది.




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/