Begin typing your search above and press return to search.

బాలయ్య ధైర్యమేంటసలు..

By:  Tupaki Desk   |   21 Feb 2017 5:09 AM GMT
బాలయ్య ధైర్యమేంటసలు..
X
నందమూరి బాలకృష్ణ వందో సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ముందుగా ఈ సమాచారం బయటికి వచ్చినపుడు జనాలు అసలు నమ్మనే లేదు. క్రిష్ ఏంటి.. బాలయ్యను డైరెక్ట్ చేయడమేంటి అన్నారు. కానీ అదే నిజమైంది. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ వచ్చింది. ఐతే వందో సినిమాకు ఆ రకంగా సర్ప్రైజ్ చేసిన బాలయ్య.. 101వ సినిమా విషయంలో ఇంకో రకంగా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఎవ్వరూ ఊహించని విధంగా తమిళ సీనియర్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు బాలయ్య.

క్లాస్ గా.. ప్రయోగాత్మకంగా సినిమాలు తీసే క్రిష్.. మాస్ సినిమాలు చేసే బాలయ్యను ఎలా చూపిస్తాడు.. ఆయనతో ఎలాంటి సినిమా తీస్తాడు అని జనాలు ఆశ్చర్యపోయారు కానీ.. అతడి విషయంలో వ్యతిరేకత ఏమీ లేదు. కానీ కె.ఎస్.రవికుమార్ విషయంలో మాత్రం నందమూరి అభిమానులు ఏమంత పాజిటివ్ గా లేరు. ఇంతకుముందు ‘సింహా’తో చాలా ఏళ్ల తర్వాత హిట్టు కొట్టి ఊపులోకి వచ్చిన బాలయ్య దాసరి నారాయణరావు లాంటి సీనియర్ డైరెక్టర్ తో ‘పరమవీరచక్ర’ చేసి దారుణమైన ఫలితాన్నందుకున్నాడు. దాసరి ఒకప్పుడు ఎంత గొప్ప డైరెక్టర్ అయినా కావచ్చు. కానీ ఆయన ఔట్ డేట్ అయిపోయారు. సినిమాపై ఆ ప్రభావం పడింది. ఇక కె.ఎస్.రవికుమార్ ను దాసరితో పోల్చలేం కానీ.. ఆయన కూడా దాదాపుగా ఔట్ డేట్ అయిపోయారు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్లు ఇచ్చి ఉండొచ్చు కానీ.. ఆయన నుంచి ఓ మోస్తరు సినిమా వచ్చి కూడా చాలా కాలమైపోయింది. రజినీతో చేసిన ‘లింగ’ పరిస్థితేంటో తెలిసిందే. తమిళ హీరోలే ఆయనతో పని చేయడానికి ఆసక్తి చూపించట్లేదు. ఇలాంటి టైంలో బాలయ్య కె.ఎస్.కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి బాలయ్య ఏ ధైర్యంతో ఆయనతో సినిమా చేస్తున్నాడో మరి?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/