Begin typing your search above and press return to search.

టీఎస్సార్‌ అవార్డ్‌ ఫంక్షన్‌ లో బాలయ్య స్పీచ్‌ అదుర్స్

By:  Tupaki Desk   |   18 Feb 2019 12:53 PM GMT
టీఎస్సార్‌ అవార్డ్‌ ఫంక్షన్‌ లో బాలయ్య స్పీచ్‌ అదుర్స్
X
ప్రతి సంవత్సరం టీఎస్సార్‌ తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు బాలీవుడ్‌ కు చెందిన స్టార్స్‌ కు సైతం అవార్డులు ఇస్తున్న విషయం తెల్సిందే. 2017 - 2018 సంవత్సరానికి గాను కళాబంధు టీ సుబ్బిరామిరెడ్డి అవార్డులను ఇవ్వడం జరిగింది. వైజాగ్‌ లో భారీ ఎత్తున నిర్వహించిన ఈ వేడుకలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇంకా పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంకు గాను బాలకృష్ణ అవార్డును అందుకోవడం జరిగింది. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా జరిగిన పుల్వామ ఉగ్ర దాడిలో అమరులైన వీర జవాన్‌ లకు శ్రద్దాంజలి ఘటించిన బాలకృష్ణ ఆ తర్వాత మాట్లాడుతూ.. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికులు ఉగ్రవాదుల దుశ్చర్యలకు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్‌ ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లుగా బాలకృష్ణ అన్నాడు.

ప్రతి సంవత్సరం టీఎస్సార్‌ ఇలా సినీ కళాకారులకు అవార్డులు ఇస్తూ ప్రోత్సహించడం మంచి పరిణామం అని, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో తాను పోషించిన పాత్రకు ఈ అవార్డు రావడం తనకు మరింత సంతోషాన్ని కలిగించినట్లుగా చెప్పుకొచ్చాడు. నాన్నగారు చేయలేని ఆ పాత్ర చేసినందుకు తాను ఎప్పటికి మర్చి పోలేను అన్నాడు.

ప్రస్తుతం దేశంలో పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. అప్పట్లోనే విదేశీయులు భారత దేశాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించగా విదేశీయులకు ఎదురు వెళ్లి మరీ పోరాడిన ఘనత గౌతమి పుత్ర శాతకర్ణికే దక్కుతుందని బాలయ్య అన్నారు. బాలయ్య దేశ భక్తి, అమర జవాన్‌ ల గురించి మాట్లాడటంతో సోషల్‌ మీడియాలో ఆ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.