వాట్స్ అప్ అంతా బాలయ్యే

Sat Jan 13 2018 14:51:53 GMT+0530 (IST)

జైసింహ ఫైనల్ రిజల్ట్ - కమర్షియల్ స్టామినా ఏంటి అనేది తేలడానికి ఇంకో రెండు రోజులు టైం పడుతుంది కాని అభిమానులు మాత్రం సినిమా పట్ల ఆనందంగానే ఉన్నారు. రొటీన్ మసాలా సినిమా అయినప్పటికీ బాలయ్య ఎనర్జీకి - వేసిన స్టెప్పులకు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా అమ్మ కుట్టి సాంగ్ లో తన వయసును మరిచిపోయి మరీ బాలయ్య వేసిన మూమెంట్స్ కి ఆయన పక్కన నటాషా దోషి ఉందనే విషయాన్నీ కూడా ప్రేక్షకులు మర్చిపోయారు. అంతగా మెస్మరైజ్ చేసేసారు యువరత్న. ఇప్పుడు వాటి తాలుకా వీడియో బిట్స్ వాట్స్ అప్ - సోషల్ మీడియా లో విపరీతంగా షేర్ అవుతున్నాయి. మొదటి ఆట కాగానే ఇవి బయటికి రావడం విశేషం.ఇలా తీయటం తప్పే. కాని అభిమానులు ఉత్సాహం ఆపుకోలేక వీటిని తమ సెల్ ఫోన్స్ లో చిత్రీకరించి తమకు కావాల్సిన వాళ్ళకు పంపడంతో ఇవి కాస్త దూరాలు దాటి అందరి నెంబర్లకు చేరిపోతున్నాయి. జైసింహ చూడాలి అనే కారణాల్లో అమ్మ కుట్టి సాంగ్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇది వివిధ గ్రూప్స్ లో సర్కులేట్ అవుతూ ఆఖరికి ఫేస్ బుక్ వాల్స్ పైకి కూడా వచ్చేసింది. ఇలా ఓపెన్ గా పోస్ట్ చేయటం వల్ల థియేటర్ లో చూడాల్సిన కిక్ మిస్ అవుతుంది అని ఫాన్స్ అంటున్నా ఇది ఆగేలా లేదు.

ఇంత వయసులోనూ బాలకృష్ణ కష్టపడుతున్న తీరు చూస్తుంటే మొన్నోసారి జానీ మాస్టర్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఒక రాత్రంతా ప్రాక్టీసు చేసి మరుసటి రోజే షూట్ కోసం వచ్చిన బాలయ్య లాంటి హీరోను తాను చూడలేదు అని ఆయన అన్న మాట తెలిసిందే. అది ఈ పాటకే అని అభిమానుల్లో చర్చ మొదలైంది. అప్పర్ కోట్ జిప్ వేస్తూ తీస్తూ కాళ్ళు మెలికలు తిప్పుతూ ఒక స్టెప్ - కుర్చీను ఒంటి కాలితో నెట్టుకుంటూ సిగరెట్ కాల్చే స్టెప్ - నటాషా పై కొద్దిగా కష్టం అనిపించే మోకాలిపై ఉంటూ వేసిన స్టెప్ ఇవన్ని ఇప్పుడు వైరల్ రూపంలో షేర్ అవుతున్నాయి.