Begin typing your search above and press return to search.

విలన్ రోల్స్ కి రెడీ: బాలకృష్ణ

By:  Tupaki Desk   |   22 Sep 2018 11:24 AM GMT
విలన్ రోల్స్ కి రెడీ: బాలకృష్ణ
X
భారీ అభిమానగణం కలిగిన సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. రీసెంట్ గా అయన రానా దగ్గుబాటి తో కలిసి దుబాయ్ లో జరుగుతున్నా సైమా వేడుకలకు హాజరయ్యారు. అక్కడ పై బాలయ్య - రానా రెడ్ కార్పెట్ ఎంట్రీ ఇచ్చారు. ఇక అక్కడ ఉన్న యాంకర్ సీనియర్ నందమూరి స్టార్..జూనియర్ దగ్గుబాటి స్టార్లిద్దరితో కాసేపు మాట్లాడింది.

మొదట రానా తో మాట్లాడిన ఆ యాంకర్ 'బాహుబలి' గురించి అడిగింది. "నా జీవితంలో ఐదారేళ్ళ సమయ బహుబలే. పార్ట్ 1 వచ్చింది.. పార్ట్ 2 వచ్చింది. ఇప్పుడు కూడా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. చాలా సంతోషం గా ఉంది" అన్నాడు. మళ్ళీ యాంకర్ "భల్లాల దేవా ను స్క్రీన్ పై చూస్తే అక్కడ రానా కనపడలేదు.. భల్లాలదేవా మాత్రమే కనపడ్డాడు. మరి ఆ పాత్ర బెస్ట్ నెగెటివ్ రోల్ కి నామినేట్ కావడం ఎలా ఉంది? అంటే "అదెప్పుడూ గర్వకారణమే." అన్నాడు

ఇక బాలయ్య అందుకుంటూ.. "నేను నెగెటివ్ రోల్స్ చేసేందుకు రెడీ" అన్నారు. ఇక యాంకర్ "పాయింట్ టేకెన్. బట్ సర్.. మీరు బాహుబలి-2 చూశారా?" అని అడిగింది. "ఆ చూశా. భయపడ్డాను.. నెగెటివ్ రోల్ చేస్తే నామీద అభిమానులు చాలా కేసులు పెడతారు. అని పెద్దగా నవ్వేశారు. బాలయ్య విలన్ రోల్ చేస్తే ఫ్యాన్స్ ఊరుకోరు గానీ యాంటి హీరో చేస్తే ఒప్పుకుంటారేమో..!

రానా బాహుబలి-2 సినిమాకు ఉత్తమ విలన్ గా అవార్డు అందుకోగా.. బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు గాను ఉత్తమ నటుడిగా క్రిటిక్స్‌ కేటగిరిలో అవార్డ్‌ను అందుకున్నారు.