బ్రహ్మ తేజ ప్రొడక్షన్స్ నిర్మాణ సారథ్యంలో..

Thu Oct 12 2017 23:26:17 GMT+0530 (IST)


తెలుగు చిత్రపరిశ్రమలోనే కాకుండా రాజకీయాల్లో కూడా ఎన్నో సంచలనాలు సృష్టించిన నందమూరి తారకరామారావు జీవితం త్వరలోనే రెండు విభిన్న కోణాల్లో తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. అయితే విషయాన్ని పక్కనపెడితే. ఎన్టీఆర్ బయోపిక్ ని ఎన్నో రోజులుగా తెరకెక్కిస్తానని చెబుతున్న బాలకృష్ణ ఎట్టకేలకు అన్నట్లుగానే తను అనుకున్నట్టుగానే తెరకెక్కిస్తున్నాడు. బాలయ్య తన సొంత బ్యానర్ ని కూడా ఈ సినిమా ద్వారా స్టార్ట్ చేయబోతున్నాడు.చాలా రోజులుగా ఆలోచించి ఫైనల్ గా 'బ్రహ్మ తేజ ప్రొడక్షన్' అనే బ్యానర్ ని బాలయ్య సెట్ చేశాడట. ఎన్టీఆర్ బయోపిక్ తో ఈ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అవుతున్నందుకు నందమూరి అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. తన కూతుళ్ళు బ్రాహ్మణి.. తేజస్విని పేర్లు కలిసొచ్చేలా ఈ పేరును ఎంచుకున్నాడు అంటున్నారు సన్నిహితులు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ యుక్త వయసులోకి ఉన్నప్పుడి పాత్రను బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ చేయనున్నాడని రూమర్లు వస్తున్నాయి. అలాగే ఎన్టీఆర్ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు జరిపే సీన్స్ లలో కూడా మోక్షజ్ఞ కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ పాత్ర తో నందమూరి నుంచి మరో వారసుడు వస్తున్న నేపధ్యంలో సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతున్నాయి.

ఇకపోతే ఈ సినిమాను వీలైనంత త్వరగా మొదలు పెట్టి వచ్చే ఎలక్షన్స్ కంటే ముందుగానే సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా చేస్తే ఇటు బయోపిక్ పరంగానే కాకుండా.. అటు ఎలక్షన్లకు క్యాంపెయినింగ్ వీడియోగా కూడా ఈ సినిమా ఉపయోగపడుతుందేమో!!