బాలయ్య జోరు.. పూరీ పొగరు..

Fri Aug 11 2017 22:29:47 GMT+0530 (IST)

హీరోని బట్టి కథలు రాసే కాలం పోయి కథను బట్టి హీరో మారే కాలం వచ్చింది. పూరీ జగన్నాధ్ తో తొలిసారిగా జతకట్టిన నందమూరి బాలకృష్ణ మరోసారి రుజువు చేశాడు అదే విషయాన్ని. అసలు బాలయ్య తన 101 వ సినిమా పూరీ జగన్నాధ్ తో చేస్తున్నాడు అన్నప్పటి నుండే ‘పైసా వసూల్’ సినిమా పై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ట్రైలర్ కూడా విడుదలై బాలకృష్ణ అభిమానులునుకు  ఆనందాన్ని పంచింది. ఈ సినిమా బాలయ్య అభిమానులుకే కాకుండా తెలుగు చిత్ర అభిమానులులో కూడా ఆసక్తి పెంచింది. బాలయ్య లుక్ గాని అతని డైలాగ్ చెప్పే విదనంగాని అన్ని కొత్తగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు విడుదల చేసిన స్టంపర్ మేకింగ్ వీడియొ చూస్తే ఈ సినిమా ప్రేక్షకులును కచ్చితంగా అలరించబోతుంది అని తెలుస్తుంది.పూరీ సినిమాలో హీరోలు ఏ విదంగా మాట్లాడుతారో మనం చాల సినిమాలు చూశాం. అలాగే బాలయ్య డైలాగ్లు ఏ రేంజ్లో చెబుతాడో కూడా తెలుగు ప్రేక్షకులుకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాలయ్య కథకు పాత్రకు తగ్గట్లు మారి పూరీ జగన్నాధ్ తయారు చేసిన పాత్రలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేశాడు. ఈ మేకింగ్ వీడియోలో బాలయ్య ఎనర్జి చూస్తే ఇంకా బాలయ్యకు చాలా వయసు ఉందే అనిపిస్తుంది. వయసు ఛాయలు కానీ ఆ వయసు వలన వచ్చే అలసట కానీ ఎక్కడా లేదు బాలయ్య యాక్షన్లో. వర్షం ఎఫెక్ట్ లో నల్లని ఓవర్ కోట్ వేసుకొని గొడుగును చేతిలో తిప్పుతుంటే మళ్ళీ పదేళ్ళు వెనకకు వెళ్ళినట్లు కనిపిస్తున్నాడు. బాలకృష్ణ జోరు చూస్తూ ఉంటే ఈ సినిమా 100 శాతం యాక్షన్ వినోదం తో అలరించనుంది అని అర్ధం అవుతుంది. యాక్షన్ ఒకటే కాదు అల్లరి చేసే ఐటెమ్ సాంగ్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మెడలో పూలదండ వేసుకొని చేతితో దాన్ని ఊపుతూ ముందుకొట్టిన ఏనుగు లా చెలరేగుతున్నాడు. బాలయ్య జోరుకి పూరీ హీరో పొగరికి పైసా వసూల్ చేస్తుంది అని మనం ఒక నిర్ణయానికి రావచ్చు.

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విజయం తరువాత కొత్త లుక్ తో స్టైలిష్ యాక్షన్ తో వస్తున్న బాలయ్య 101 వ సినిమాను పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 1 న ఈ సినిమా విడుదల చేయడానికి అన్నీ సిద్దం చేస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. పైసా వసూల్ సినిమాకు నిర్మాతగా భవ్య క్రియేషన్స్ చేస్తుంది.