Begin typing your search above and press return to search.

బాలయ్య ఫైట్లలో నో కాంప్రమైజ్

By:  Tupaki Desk   |   18 May 2017 10:08 AM GMT
బాలయ్య ఫైట్లలో నో కాంప్రమైజ్
X
బాలకృష్ణ సినిమాలంటే డైలాగులు, ఫైట్లు కరెక్ట్ గా ఉంటే చాలు.. అభిమానులు ఉప్పొంగిపోతారు. బోయపాటి ఆ పల్స్ పట్టుకోగలిగాడు కాబట్టే బాలయ్యతో రెండు బంపర్ హిట్లు కొట్టాడు. గౌతమీపుత్ర శాతకర్ణితో 100 సినిమాల మైలురాయిని దాటిన బాలకృష్ణ తన 101వ చిత్రం పూరి జగన్నాథ్ తో చేసేందుకు ముందుకొచ్చాడు. పూరి సినిమాల్లో హీరో క్యారెక్టర్లంతా కాస్త డిఫరెంట్ గానే ఉంటాయి. మరి ఇప్పుడు బాలయ్యను ఎలా చూపిస్తారా అని అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

పూరి జగన్నాథ్ తన సినిమాలను డైలాగ్ వెర్షన్ తనే రాసుకుంటాడు. సినిమా ఫలితం ఎలాగున్నా పూరి డైలాగులకు మాత్రం మంచి పేరొస్తుంది. నేనింతే.. కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి సినిమాలు ఇందుకు ఉదాహరణ. ప్రేక్షకులతో విజిల్స్ వేయించేలా డైలాగులు చెప్పడంలో బాలయ్య తర్వాతే ఎవరైనా. దీంతోపాటు ఫైట్స్ విషయంలోనూ ఎక్కడా కాంప్రమైజ్ అవకూడదని పూరి డిసైడైపోయాడు. అందుకే ఈ సినిమాకు హాలీవుడ్ నుంచి స్టంట్ మాస్టర్ ను తీసుకొచ్చారు. ప్రస్తుతం చిత్రం యూనిట్ పోర్చుగల్ లో ఉంది.

దాదాపు 40 రోజుల పాటు ఇక్కడ షూటింగ్ కొనసాగుతోంది. తాజాగా హీరో బాలకృష్ణతో రెండు రిస్కీ స్టంట్ సీన్స్ తీశారని యూనిట్ వర్గాల సమాచారం. ఈ సినిమా కథలో ఇవే కీలకమైన సన్నివేశాలు కావడంతో 57 ఏళ్ల వయసులోనూ బాలయ్య రిస్క్ లెక్క చేయకుండా ఈ స్టంట్ చేశారని అంటున్నారు. రెండు పాటలతోపాటు మరికొంత సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యాక సినిమా యూనిట్ ఇండియాకు తిరిగిరానుంది.

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ పక్కన శ్రియాసరన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ గా ముస్కాన్ ను తెలుగు తెరకు తొలిసారి పరిచయం చేస్తున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాకు ఇంతవరకు టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఉస్తాద్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో బాలయ్య డాన్ గా కనిపించనున్నాడని సమాచారం. మరి డాన్ అన్నాక ఆ మాత్రం రిస్కీ ఫైట్లు ఉండాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/