Begin typing your search above and press return to search.

అందరూ వచ్చారు.. బాలయ్య ఒక్కరే లేరు!

By:  Tupaki Desk   |   11 Nov 2018 8:50 AM GMT
అందరూ వచ్చారు..  బాలయ్య ఒక్కరే లేరు!
X
ప్రేక్షకులు ఎప్పటి నుండో ఆసక్తిగా ఎదురు చూస్తున్న SS రాజమౌళి తాజా చిత్రం #RRR లాంచ్ ఈవెంట్ ఈరోజే జరిగింది. మెగా - నందమూరి మల్టిస్టారర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.

కె. రాఘవేంద్ర రావు..చిరంజీవి.. అల్లు అరవింద్.. సురేష్ బాబు.. కీరవాణి.. శ్యాంప్రసాద్ రెడ్డి.. వీవీ వినాయక్.. కొరటాల శివ.. ప్రభాస్.. రానా దగ్గుబాటి.. బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ- ప్రసాద్ దేవినేని.. బీవీఎస్ ఎన్ ప్రసాద్.. ఇలా లిస్టు చాలా పెద్దదే ఉంది. మెగా ఫ్యామిలీ నుండి చిరు.. అల్లు అరవింద్ హాజరయ్యారు.నందమూరి ఫ్యామిలీ నుండి బాలకృష్ణ ఈ సినిమా లాంచ్ ఈవెంట్ కు హాజరవుతారని వార్తలు రావడంతో అయన వస్తారనుకున్నారు. కానీ బాలయ్య లాంచ్ ఈవెంట్ కు రాకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.

ఇప్పటికే ఈ లాంచ్ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమా హీరోలు జూనియర్ ఎన్టీఆర్.. అయ్యప్ప మాల ధరించిన చరణ్ అతిథులతో ముచ్చటిస్తున్న ఫోటోలు అభిమానులకు ఆనందాన్నిస్తున్నాయి.