హిందీ.. తమిళంలోనూ ఎన్టీఆర్ సినిమా?

Fri Oct 13 2017 19:48:09 GMT+0530 (IST)

నందమూరి బాలకృష్ణ తన తండ్రి జీవిత కథతో సినిమా తీయడానికి జోరుగానే సన్నాహాలు చేస్తున్నాడు. ఇన్నాళ్లూ వ్యవహారం కొంచెం తాపీగా నడిచింది కానీ.. రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను అనౌన్స్ చేసి.. త్వరలోనే ఆ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తుండటంతో బాలయ్య త్వరపడక తప్పట్లేదు. తేజను దర్శకుడిగా కన్ఫమ్ చేసిన బాలయ్య ప్రి ప్రొడక్షన్ కూడా వేగవంతం చేశాడు.వర్మ సినిమా మొదలవడాని కంటే ముందే బాలయ్య బృందం సినిమాను మొదలుపెట్టేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంతో బాలయ్యే స్వయంగా నిర్మాత అవతారమెత్తుతున్న సంగతి తెలిసిందే. సెలబ్రెటీ క్రికెట్ లీగ్ తో పాపులరైన విష్ణు ఇందూరి.. బాలయ్య సన్నిహితుడు సాయి కొర్రపాటి కూడా ఇందులో భాగస్వాములవుతున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ఏంటంటే.. ఇది తెలుగుతో పాటు హిందీ.. తమిళ భాషల్లోనూ తెరకెక్కుతుందట. ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా పాపులర్ కాబట్టి ఈ చిత్రం హిందీ.. తమిళ భాషల్లోనూ వర్కవుటవుతుందని భావిస్తున్నారట. తక్కువ బడ్జెట్లో సినిమాను తెరకెక్కించి.. మిగతా భాషల్లోనూ రిలీజ్ చేస్తే భారీగా లాభాలు అందుకోవచ్చని భావిస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ విష్ణు.. సాయినే చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.