Begin typing your search above and press return to search.

బాలయ్య 101 ఆయన చేతిలోకేనా?

By:  Tupaki Desk   |   20 Feb 2017 7:47 AM GMT
బాలయ్య 101 ఆయన చేతిలోకేనా?
X
శత చిత్ర హీరో నందమూరి బాలకృష్ణ.. తన వందో సినిమాతో తిరుగులేని విజయం అందుకున్నారు. సెంచరీ మూవీతో హాఫ్ సెంచరీ క్లబ్ లోకి కూడా ప్రవేశించి.. గౌతమిపుత్ర శాతకర్ణితో 50 కోట్ల షేర్ వసూళ్లను సాధించారు. మరి బాలయ్య 101వ చిత్రం సంగతేంటి అనే ప్రశ్న చాలా రోజుల నుంచే వినిపిస్తోంది.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టును తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ చేతిలో పెట్టేశారనే టాక్ వినిపిస్తోంది. ఈయన చెప్పిన సబ్జెక్ట్ నచ్చడంతో పాటు.. ఇతర ప్రాజెక్టులతో ఉన్న కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లెమ్స్.. ఈ డెసిషన్ కి కారణంగా తెలుస్తోంది. కృష్ణవంశీతో రైతు మూవీ చేద్దామని అనుకుంటున్నా.. ఇప్పుడే ఆ సినిమా పట్టాలెక్కే పరిస్థితి లేదు. మరోవైపు సింగీతం దర్శకత్వంలో ఆదిత్య 369కి సీక్వెల్ గా ఆదిత్య 999 చేయాలని భావిస్తున్నా.. వరుసగా రెండో ప్రయోగం చేయడం రిస్క్ అనుకుంటున్నారట బాలయ్య. అందుకే మధ్యలో ఓ కమర్షియల్ మూవీ చేయాలన్నది ఆయన యోచన.

అందుకే ఇప్పుడు కేఎస్ రవికుమార్ ప్రాజెక్టుకే మొగ్గు చూపారని.. ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేయగా.. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయని టాక్ వినిపిస్తోంది. త్వరలో బాలయ్య తన 101వ సినిమాపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. సి కళ్యాణ్ బాలయ్య101ను నిర్మించనుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడని మరో రూమర్ కూడా వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/