Begin typing your search above and press return to search.

పవన్ వెర్సస్ బాలయ్య.. అంతేనా?

By:  Tupaki Desk   |   12 Dec 2017 12:42 PM GMT
పవన్ వెర్సస్ బాలయ్య.. అంతేనా?
X
పోయినేడాది సంక్రాంతికి మూడు భారీ సినిమాలు.. ఒక మీడియం రేంజి సినిమా రిలీజయ్యాయి. వీటిలో మూడు సినిమాలు మంచి ఫలితాన్నందుకున్నాయి. ఒకటి యావరేజ్‌గా ఆడింది. ఈ ఏడాది రెండు బడా సినిమాలు.. ఒక మీడియం సినిమి విడులయ్యాయి. మూడూ కూడా భారీ వసూళ్లు సాధించాయి. మిగతా సీజన్లలో పోటీ ఉంటే వసూళ్లపై ఎక్కువ ప్రభావం పడుతుంది కానీ.. సంక్రాంతి టైంలో మరీ అంత ఇబ్బందేమీ ఉండదని గత రెండు సీజన్లలో రుజువైంది. దీంతో 2018 సంక్రాంతికి కూడా తీవ్ర పోటీ తప్పదని భావించారు. ముందు సంక్రాంతి మీద ఐదారు సినిమాలు కన్నేశాయి. కానీ తర్వాత సీన్ మారింది. రేసులో ఉన్న సినిమాలు అనివార్య కారణాలతో తప్పుకున్నాయి.

చివరికి సంక్రాంతి రేసులో ఉన్న తెలుగు సినిమాలు రెండంటే రెండే. ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్నాతవాసి’ కాగా.. ఇంకోటి బాలయ్య కథానాయకుడిగా నటిస్తున్న ‘జై సింహా’. ఇవి రెండూ మాత్రమే సంక్రాంతి రిలీజ్ డేట్లను ఖరారు చేసుకున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకుని చకచకా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకోవడంపై దృష్టిపెట్టాయి. సంక్రాంతి సీజన్ కు మిగిలింది ఇంకో నెల రోజులు మాత్రమే. ఇంకేవైనా సినిమాలు వచ్చేట్లయితే రిలీజ్ డేట్‌లు ఖరారు చేసుకోవాలి. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండాలి. ఐతే వేరే సినిమాలేవీ అలాంటి స్థితిలో కనిపించట్లేదు. సంక్రాంతికి వస్తాయన్న సినిమాల్లో రాజ్ తరుణ్ ‘రాజు గాడు’ కానీ.. రవితేజ ‘టచ్ చేసి చూడు’ కానీ అలాంటి స్థితిలో ఉన్నట్లుగా లేవు. తెలుగు నుంచి ‘అజ్నాతవాసి’.. ‘జై సింహా’ మాత్రమే సంక్రాంతి బరిలో నిలిచేట్లు కనిపిస్తున్నాయి. డబ్బింగ్ సినిమాలు ‘గ్యాంగ్’.. ‘అభిమన్యుడు’ వస్తే రావచ్చేమో కానీ.. తెలుగు నుంచి మాత్రం సంక్రాంతికి పవన్-బాలయ్య పోరు మాత్రమే చూసేలా ఉన్నాం.