బాలయ్య.. అంత కోపం ఎలయ్యా??

Thu Jan 12 2017 13:12:46 GMT+0530 (IST)

స్టార్ హీరోలు అన్న తరువాత అభిమానులు కాసింత ఓవర్ హైప్ తోనే ఉంటారు. దానిలోనూ పెద్ద పెద్ద హీరోలైన చిరంజీవి.. బాలయ్య.. నాగార్జున వంటి స్టార్లు బయట కనిపిస్తే చాలు.. అభిమానులు కూడా రెచ్చిపోతారు. కాసింత క్రేజ్ మైకంలో వారి స్టార్ హీరోను ఒకసారి చేత్తో తాకాలనో.. వారికి షేక హ్యాండ్ ఇవ్వాలనో చూస్తుంటారు. సరిగ్గా అలాంటప్పుడే స్టార్ హీరోలు కూడా సహనం కోల్పోతుంటారు. గతంలో ఒకసారి కింగ నాగార్జున కూడా ఇలాగే తిరుపతి ఎయిర్ పోర్టులో కాస్త సహనం కోల్పోయి ఒక అభిమానిపై చేయిచేసుకున్న సందర్బం కూడా మనం చూశాం.ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ఒక అభిమాని చేతిపై కోట్టడంతో.. అతగాడి ఐఫోన్ స్లిప్పయ్యి కింద పడిపోయింది. గురువారం ఉదయం అభిమానులతో కలసి గౌతమిపుత్ర శాతకర్ణి ప్రీమియర్ షో చూడాలని బాలయ్య విచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే షో ముగించుకుని వెళ్తున్న సమయంలో.. ఒక యంగ్ నందమూరి అభిమాని.. ఒక సెల్ఫీ కోసం విశ్వప్రయత్నం చేశాడు. ఒక్క సెల్ఫీ సార్ అంటూ ఫోన్ బాలయ్య ముఖానికి అడ్డు పెట్టడంతో.. బాలయ్య ఒక్కసారిగా ఆ చేతిని నెట్టేయడంతో.. అభిమాని ఐఫోన్ కిందపడిపోయింది. అంతలో కొందరు అనుచరులు.. బాలయ్యకు సైడ్ ఇవ్వమని కోరుకోవడంతో.. ఆ అభిమాని ఇక నిస్పృహతో సైడ్ అయిపోయాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/