Begin typing your search above and press return to search.

సెంచరీకి జనవరి 12న ముహూర్తం ఫిక్స్

By:  Tupaki Desk   |   26 July 2016 3:11 PM GMT
సెంచరీకి జనవరి 12న ముహూర్తం ఫిక్స్
X
నటసింహం నందమూరి బాలకృష్ణ తన వందో సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసేస్తున్నారు. రీసెంట్ గా ఆయనంతటే ఆయనే బ్రేక్ ఇచ్చేవరకూ షూటింగ్ ఆగలేదు. పెళ్లి డేట్ దగ్గరపడ్డా.. సినిమా పనుల్లో నిమగ్నమైన క్రిష్ ని పిలిచి.. బ్రేక్ తీసుకోమని చెప్పారు బాలయ్య.

క్రిష్ డైరెక్షన్ లో గౌతమి పుత్ర శాతకర్ణి ఎప్పుడు వస్తుందా అని అభిమానులు, ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ ముహూర్తం ఎప్పుడో చెప్పేశాడు దర్శకుడు. తాజాగా అల్లు శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్ కు వచ్చిన క్రిష్.. బాలయ్య సినిమా విడుదల తేదీపై గుట్టు విప్పేశాడు. ముందుగా అనుకున్నట్లే సంక్రాంతి పండక్కే రిలీజ్ ఉంటుందన్న ఈ డైరెక్టర్.. 12 జనవరి 2017న గౌతమిపుత్ర శాతకర్ణిని విడుదల చేస్తామని చెప్పాడు. క్రిష్ పెళ్లి వేడుకలు పూర్తి కాగానే.. చిన్న గ్యాప్ తీసుకుని ఆగస్ట్ మధ్యలో గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.

అయితే.. ఈ లోపుగా ఇప్పటికే తీసిన యుద్ధ సన్నివేశాలకు సంబంధించి.. గ్రాఫిక్ వర్క్స్ చేసేస్తున్నారు. అటు తన పెళ్లి పనులతో పాటు ఇటు గౌతమిపుత్ర శాతకర్ణికి గ్రాఫిక్స్ పనులను కూడా పర్యవేక్షిస్తున్నాడు క్రిష్. ఏమైనా దర్శకుడి నోటి నుంచి రిలీజ్ డేట్ వినిపించడంతో.. బాలయ్య అభిమానుల్లో సందడి మొదలైపోయింది.