అంతరిక్షం వైపు బాలయ్య ఫ్యాన్స్ చూపు!

Tue Dec 11 2018 13:54:26 GMT+0530 (IST)

"నోరు మంచిదైదే వూరు మంచిదవుతుంది".. "పెదవి దాటని మాటకు ప్రభువు నీవు.. పెదవి దాటిన మాటకు బానిస నీవు" ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో మాటతీరు తీరు ఎలా ఉండాలనే విషయంపై ఎన్నో సామెతలు ఉన్నాయి.  కారణాలు ఏవైనా కానివ్వండి.. మనం మాత్రం మాటలు అలోచించే మాట్లాడలనేది వాటి ఆర్థం. అలా కాదు అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను అంటే.. ఆ మాటల పరిణామాలు ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలి. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు విషయంలో ఇలానే జరుగుతోంది.నందమూరి బాలకృష్ణ ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ 'బాలయ్య ఎవరో నాకు తెలీదన్నాడు'.  అదే నందమూరి ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించింది.. కానీ నాగబాబు అంతటితో ఆగకుండా కామెడీ చేస్తూ తనకు పాత తరం కమెడియన్ వల్లూరి బాలకృష్ణ తెలుసంటూ ఒక వీడియో విడుదల చేసి పుండు మీద కారం చల్లాడు.  దీంతో నందమూరి అభిమానులు నాగబాబు పెరెత్తితేనే మండి పడుతున్నారు. ఇప్పుడు ఈ కోపం అంతా నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ నటిస్తున్న 'అంతరిక్షం' పై చూపించడానికి రెడీ అవుతున్నారట.  'అంతరిక్షం' సినిమాను  విడుదల కానివ్వకుండా అడ్డుకుంటామని ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్లు ప్రకటించాయి.  సోషల్ మీడియాలో కూడా నందమూరి అభిమానులు ఇదే విషయం స్పష్టం చేస్తున్నారు.  

మరి నాగబాబు ఏ ఉద్దేశంతో బాలయ్య పై ఫోకస్ చేశాడో తేలీదుగానీ ఇప్పుడు తన బాలయ్య ఫ్యాన్స్ అందరూ తన కుమారుడి సినిమాను టార్గెట్ చేసేలా పరిస్థితి మారిపోయింది.  'అంతరిక్షం' సినిమాకు.. నాగబాబు కామెంట్స్ కు సంబంధం లేదు. పైగా బాలయ్యకు ప్రియమైన డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాకు ఒక నిర్మాత.  అయినా ఫ్యాన్స్ కు ఇలాంటివి పట్టవుకదా. ఇలాంటి పరిస్థితిలో 'అంతరిక్షం' టీమ్ ఈ నెగెటివిటీ ని ఎలా హ్యాండిల్ చేస్తుందో వేచి చూడాలి.