Begin typing your search above and press return to search.

జై బాలయ్య టాటూలకి డిమాండ్ పెరిగింది

By:  Tupaki Desk   |   12 Feb 2016 12:58 PM GMT
జై బాలయ్య టాటూలకి డిమాండ్ పెరిగింది
X
కృష్ణగాడి వీర ప్రేమగాధలో నేచురల్ స్టార్ నాని నందమూరి నటసింహి బాలకృష్ణ అభిమానిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో జై బాలయ్య అనే టాటూ నాని చేతిపై కనిపిస్తుంది. ప్రమోషన్స్ మొదలుపెట్టిన చాలాకాలం వరకూ బాలయ్యని పెద్దగా యూజ్ చేసుకోని మూవీ యూనిట్.. విడుదలకు రెండు రోజుల ముందు నుంచి ఈ హంగామా స్టార్ట్ చేసింది.

ట్రైలర్ లలో కూడా బాలయ్య స్టైల్ లో నాని తొడగొడుతున్న సన్నివేశం సూపర్బ్ గా అలరించింది. అలాగే జై బాలయ్య టాటూని కూడా బాగానే ఎక్స్ పోజ్ చేస్తున్నారు. ప్రమోషన్లలో ఈ టాటూ హడావిడి కనిపించగానే.. సోషల్ మీడియాలో కూడా జై బాలయ్య టాటూ హంగామా మొదలైంది. ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న పిక్ లలో జై బాలయ్య టాటూ కూడా ఒకటి. ఆన్ లైన్ లోనే కాదు ఆఫ్ లైన్ లో కూడా జై బాలయ్య బాగానే సందడి చేస్తున్నాడు. చేతిపై ఈటాటూ వేయించుకుని పోస్ట్ చేయడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ లో ఈ హంగామా ఎక్కువగా ఉంది.

చేతిపై బాలయ్య టాటూ వేయించుకుని.. ఆన్ లైన్ లో పోస్ట్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. స్టార్ హీరోల అభిమానులు ఇతర హీరోలను కూడా అభిమానించడం కొత్తేం కాదు కానీ.. ఇలా ఓపెన్ గా సపోర్ట్ చేయడం మాత్రం.. అరుదైన విషయమే. కృష్ణగాడి వీర ప్రేమగాధ మూవీతో బాలయ్య ఫ్యాన్స్ కొత్త ట్రెండ్ కి నాంది పలుకుతున్నారని చెప్పాలి.