Begin typing your search above and press return to search.

99కార్లతో బాలయ్య అభిమానులు

By:  Tupaki Desk   |   1 Dec 2015 3:45 AM GMT
99కార్లతో బాలయ్య అభిమానులు
X
చారిత్రాత్మక సినిమాల అంకెకు దగ్గర పడుతున్న బాలయ్యబాబు ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో డిక్టేటర్ గా అలరించనున్న సంగతి తెలిసినదే. ఈ సినిమా బాలయ్య కి 99వ చిత్రమని తెలిసినదే. అయితే ఈ 99కూడా బాలయ్యకి మరపురాని జ్ఞాపకంగా మార్చాలని అతని అభిమానులు ఉవ్విళ్ళురుతున్నారు.

డిక్టేటర్ సినిమా ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో ఘనంగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు 99 కార్లతో బాలయ్య అభిమానులు హైదరాబాద్ నుండి అమరావతికి ర్యాలీగా తరలివెళ్లి రికార్డు సృష్టించాలని భావిస్తున్నారట. అమరావతిలో జరగనున్న తొలి సినిమా వేడుక కాబట్టి ఏర్పాట్లు భారీగా చేస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు నాయుడు ఈ వేడుకకు అతిధిగా హాజరుకానున్నారు.

ఈ సినిమాకు కోనా వెంకట్ - గోపీ మోహన్ - శ్రీధర్ సీపాన వంటి స్టార్ రైటర్ల చేయూత వుండడం గమనార్హం. తమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.