USAలో బాలయ్య అభిమానుల హంగామా

Tue Jan 10 2017 17:50:50 GMT+0530 (IST)

బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఫీవర్.. USA వరకూ పాకిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలు సృష్టించడం ఇప్పటికే ఖాయం కాగా.. ఇప్పుడు ఓవర్సీస్ అభిమానులు.. తెలుగువాడి ఘనకీర్తిని చాటి చెప్పిన శాతకర్ణి కోసం ఓ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్వయంగా వారే చెప్పేశారు.

హూస్టన్ లో బాలయ్య అభిమానులు ప్రత్యేకంగా ఓ ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేశారు. శాతకర్ణి మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఉన్నట్లు చెప్పారు బాలయ్య ఫ్యాన్స్. వందో చిత్రంగా ఎలాంటి కమర్షియల్ మూవీ చేస్తారో అనుకుంటే.. చారిత్రక చిత్రాన్ని ఎంచుకోవడం బాలయ్య ప్రతిభకు నిదర్శనం అంటున్నారు అభిమానులు. భైరవ ద్వీపం.. ఆదిత్య 369.. గౌతమిపుత్ర శాతకర్ణిలాంటి విభిన్నమైన చిత్రాలు చేయగల ఏకైక టాలీవుడ్ హీరో బాలకృష్ణ అంటూ తమ హీరోపై ప్రశంసలు కురిపించారు. తెలుగు వాడి పరాక్రమాన్ని చాటిచెప్పిన శాతకర్ణి కథతో.. ప్రపంచ ప్రజానీకం ఎదురుచూసేలా చేశారు బాలయ్య అంటూ ఆనందం వ్యక్తం చేశారు ఫ్యాన్స్. అలాగే శాతకర్ణి మూవీకి ప్రచారంగా 11వ తేదీన ఓ కార్ ర్యాలీ చేయబోతున్నట్లు అభిమానులు వెల్లడించారు.

శాతకర్ణి ముూవీలోని డైలాగులు చెప్పడంతో పాటు.. జై గౌతమీపుత్ర శాతకర్ణి.. జై బాలయ్య.. జై జై బాలయ్య అంటూ ఫ్యాన్స్ చేసిన నినాదాలు.. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సమయం లేదు మిత్రమా.. సంక్రాంతి రూపంలో 11వ తేదీన(ప్రీమియర్స్) గౌతమీ పుత్ర శాతకర్ణి వచ్చేస్తోంది.. మేం రెడీ.. మీరు రెడీయా అని ఫ్యాన్స్ అనడం.. వారిలో ఆనందాన్ని తెలియచేస్తోంది.Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/