అమెరికాలో శాతకర్ణి ఫ్యాన్స్ హంగామా!

Thu Jan 12 2017 12:03:49 GMT+0530 (IST)

బాలకృష్ణ ల్యాండ్ మార్క్ మూవీ గౌతమీపుత్ర శాతకర్ణి గురువారం అత్యంగ ఘనంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన సంగతి తెలిసిందే. దీంతో అభిమానుల సంబరాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై నెటిజన్లు పాజిటివ్ రివ్యూలు ఇవ్వడం మరికొంతమంది సెలబ్రెటీలు సైతం "సూపర్" అని స్పందించడంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సుమా... అమెరికాలో కూడా!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు సినిమాలపై తమ అభిమానాన్ని ఎప్పుడూ చూపిస్తూనే ఉంటారు. ఇదే క్రమంలో తాజాగా బాలయ్య వందో సినిమా "గౌతమీపుత్ర శాతకర్ణి" కి సంబందించిన ప్రీమియర్ షో అమెరికాలో మొదలైంది. ఈ సందర్భంగా తమ సంబరాలను డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్న బాలయ్య అభిమానులు... 100కిలోల బరువైన కేక్ ను కట్ చేసి షాంపియన్ బాటిల్స్ తో సంబరాలు చేస్తూ తమ ఆనందాన్ని ఒకరికొకరు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/